జగన్ షాకింగ్ నిర్ణయం…… రోజాకు చెక్

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో నోటి దురుసు వ్యాఖ్య‌లు చేసే నాయ‌కులు చాలా మందే వుంటారు. అలాంటి వారిలో అందరినీ మించి ఆరితేరినవారు నగరి ఎమ్మెల్యే రోజా.. టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసి ఇప్పుడు టీడీపీనే భయంకరంగా విమర్శించే రోజా కు జగన్ చెక్ పెడుతున్నారనే చర్చ వైసీపీలో జోరుగా జరుగుతుంది.

వైసీపీ ఎమ్మెల్యేల్లో కొడాలి నాని, రోజా ఇద్ద‌రూ తెలుగుదేశం పై చంద్ర‌బాబు పై తీవ్రమైన విమ‌ర్శ‌లు చేస్తారు.అయితే వారికి రాజ‌కీయ బిక్ష పెట్టింది మాత్రం తెలుగుదేశం అనేది మ‌ర్చిపోతారు. నగరి ఎమ్మెల్యే రోజా మాటలు మహిళలు సైతం సిగ్గు తో తల దించుకునేలా ఉంటాయి. అసెంబ్లీ వేదికగా రోజా చేసిన పనులు, ఆమె మాట్లాడిన మాటలకు తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత కన్నీటి పర్యంతం అయ్యారు. మాజీ మంత్రి పీతల సుజాత , అనిత రోజా దాడికి నిలవలేకపోయారు. దీంతో రోజా పై అసెంబ్లీ బహిష్కరణ వేటు వేస్తే జగన్ సైతం ఆ వ్యవహారంలో చేతులెత్తేశారు. ఆమె నోటి దురుసు ఎప్పుడూ కాంట్రవర్సీనే.

అయితే ఇప్పుడు న‌గ‌రిలో సొంత ఇల్లు నిర్మించుకుని ఇక్క‌డ రాజ‌కీయంగా త‌న స‌త్తా చాటాలి అని భావిస్తోంది ఎమ్మెల్యే రోజా కు జగన్ షాక్ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు మ‌ళ్లీ ఆమె దూకుడు పెంచి నియోజకవర్గం లో పర్యటిస్తుంది..ఇక పార్టీలో ఆమె మాట‌ల‌కు క‌ళ్ళెం వేసేవారు ఎవ‌రైనా ఉన్నారా అని ఆ పార్టీ నేత‌లు సైతం ఆలోచిస్తున్నారు.ఇలా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటం పార్టీ కి తీవ్ర నష్టం చేస్తుందని భావిస్తున్న తరుణంలో రోజాను పక్కన పెడతారనే చర్చ జరుగుతుంది. ఒక వేళ అదే కనుక జరిగితే రోజా ఏ పార్టీలోకి వెళ్ళలేని స్థితి. వైసీపీనే అంటిపెట్టుకుని ఉండాల్సిన దుస్థితి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె పై వ‌చ్చిన ఆరోప‌ణ విమ‌ర్శ‌లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు కూడా ఈ సారి పార్టీ విజ‌యం పై ప్ర‌భావం చూపుతాయేమో అని వైసీపీ యోచిస్తుంది.

తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఇప్పుడు గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఫ్యామిలీ న‌గ‌రి నుంచి పోటీకి ఉన్నారు. రోజా పోటీ చేస్తే గెలిచే అవకాశాలపై చర్చిస్తున్న జగన్ వైసీపీ త‌ర‌పున కొత్త‌ వారికి ఇక్క‌డ అవ‌కాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారని టాక్ . ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి న‌గ‌రిలో పోటి చేయ‌డానికి సిద్దం అవుతున్నారు. జగన్ నుండి టికెట్ హామీ దక్కితే నగరిలో రోజమ్మకు చెక్ పడినట్టే .

Facebook Comments