జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల అడ్డంగా బుక్కవుతున్న కేసీఆర్

వైఎస్ జగన్  ఏప్పుడైతె ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో  రాష్ట్రాన్ని తన నీర్ణయాలత్ అందరిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పథకాలతో, పలు సేవ కార్యక్రమాలతో, సంచలనాత్మక నిర్ణయాలతో పాలనని కొనసాగిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణాలో ఒక కొత్త సమస్యకు కారణం రావడానికి జగన్ నంది పలికారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు దసరా, దీపావళి అంటూ సంబరాలు జరుపుకొనేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు. అయితే ఇదే జగన్ నిర్ణయం తెలంగాణాలో ఎందుకు వీలు కావడం లేదు అని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సేవ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నప్పటికీ ప్రజలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నియంతలా పరిపాలిస్తున్నాడు అంటూ ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఎన్నడూ లేని విధంగా సమ్మె చేస్తూ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. పరిపాలన విషయం లో జగన్ ని అనుసరించలేక, జగన్ నిర్ణయాలను మాత్రం హర్షిస్తూ పాలనని గంగలో కలిపారు అని కాంగ్రెస్, బీజేపీ నేతలు పలుమార్లు ఆరోపించిన విషయం అందరికి తెలిసిందే. జగన్ పారదర్శకత పాలన, సంక్షేమ పథకాల అమలు తెలంగాణాలో సరిగ్గా జరగడం లేదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. జగన్ ఆంధ్ర ప్రదేశ్ కి చేస్తున్న పనులు, తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కావడం లేదు అనేది తెలంగాణ ప్రజల ప్రశ్న? జగన్ నిర్ణయాలు తెలంగాణకు లాభమో? నష్టమో మరి మీరే చెప్పాలి.

Facebook Comments