జగన్ విజన్ ఇంతేనా…? ఇందులో కూడా సాక్షి ఫెయిలేనా…?

వైసీపీ అధినేత ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర నేటితో 3000 కిలో మీట‌ర్ల మైలురాయి దాటింది. ఈ నేపధ్యంలో ఆ పార్టీ ప‌త్రిక కొన్ని ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురించింది. జ‌గ‌న్ సాగిస్తున్న ఈ పాద‌యాత్ర వ‌ల్ల పేద‌వాడి మ‌న‌స్సాక్షి ‘జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి’ కావాల‌ని కోరుకుంటోంద‌నీ, ఆయ‌న జ‌నం గుండెల్లోకి వెళ్లార‌నీ, జ‌గ‌న్ మాట త‌ప్ప‌ని మ‌నిష‌నీ, అందుకే సీఎంని చేస్తామని ప్ర‌జ‌లు అంటున్నార‌ని ఓ క‌థ‌నంలో రాశారు! జనం గుండె చప్పుడు తమకు తెలుసు అన్న చందంగా సాగిన రాతల్లో జగన్ విజన్ పైన సాక్షి లో పని చేసే వారికి కూడా ఓ క్లారిటీ లేనట్టుంది. అందుకే స్పష్టమైన విజన్ అని మాత్రమే రాశారు. అసలు విషయానికొస్తే

జ‌గ‌న్ విజ‌న్ గురించి రాస్తూ… రాష్ట్రం ప‌ట్ల, ప్ర‌జ‌ల ప‌ట్ల ఆయ‌న‌కి స్ప‌ష్టమైన విజ‌న్ ఉంద‌నీ, పాద‌యాత్ర‌లో ఆయ‌న అవ‌లంభిస్తున్న వ్య‌వ‌హార శైలిని చూసి ప్ర‌జ‌లు దీన్ని గుర్తించార‌ని రాశారు. ఆయన అవలంబించే వ్యవహార శైలికి జగన్ విజన్ కి సంబంధం ఏమైనా వుందా అని సగటు పాఠకుడు ఆలోచనలో పడ్డాడు. ఇచ్చిన హామీలు గాలికి వ‌దిలేసే చంద్ర‌బాబు నాయుడు త‌ర‌హాలో జ‌గ‌న్ రాజ‌కీయాలు చెయ్య‌ర‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌న్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలేవి గాలికి వదిలేసినవి ఏవి.. రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్ధికే నానా తిప్పలు పడుతున్నారని సగటు పాఠకులకు తెలుసు.

జగన్ కు క‌ష్ట‌ప‌డే తత్వం ఉంద‌నీ, మ‌హానేత బాట‌ను అందుకోగ‌ల‌ర‌నే న‌మ్మ‌కం ప్ర‌జ‌ల‌కు ఉంద‌నీ, అందుకే ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని రాసేశారు. పాద యాత్రలు చేయ్య్యతమే కష్టపడే తత్వం అని ప్రజలు అనుకోరు. ఆయన్నే ముఖ్యమంత్రిని చెయ్యాలని అనుకుంటున్నారంటే అది అన్నిటికన్నా హాస్యాస్పదమే . ఎందుకంటె చంద్రబాబు పాలన తెలిసిన నాయకుడు. గతంలోనూ ముఖ్యమంత్రి హోదాలో పని చేసిన వాడు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పని చెయ్యగలిగిన వాడు. ఒక విజన్ వున్న నాయకుడు. లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని దేశంలోనే టాప్ పొజీషన్ లో ఉంచటం కోసం కేంద్రంతోనే పోరాటం చేస్తున్న వాడు. అలాంటి వాడ్ని కాదని పాలన తెలియని వాడు, ఎన్నడూ ముఖ్యమంత్రి సీట్ లో కూర్చొని వాడు. ఒక విజన్ లేని వాడు అయిన జగన్ ను సీఎం చెయ్యాలని ఎందుకనుకుంటారు. కానీ సాక్షి మాత్రం ఇలా మొత్తంగా ప్ర‌జ‌ల కోణం నుంచి, ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌నేది పూస‌గుచ్చిన‌ట్టుగా త‌మ‌కు తెలుసు అన్న ధోర‌ణిలో కథనం రాసేసింది.
క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌లంద‌రూ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌నే ఎదురు చూస్తున్నార‌ట‌..! ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తే… క‌ష్టాల్లో ఉన్న ఏ వ్య‌క్తి అయినా ముందుగా దాన్నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తాడు. స‌గ‌టు మ‌నిషి వ్య‌క్తిగ‌తంగా ఎదుర్కొంటున్న క‌ష్టానికి రాజ‌కీయ ప‌రిష్కారం కోసం చూస్తాడా..? ఎప్పుడో జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప మా కష్టాలు తీరవని కూర్చుంటారా..? ఇంకోటి, అలుపెరుగ‌ని బాట‌సారి, అవిశ్రాంత పాద‌యాత్ర అంటూ కొన్నిచోట్ల ప్ర‌స్థావించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో వారానికో బ్రేక్‌. ఇక‌, మ‌ధ్య‌లో తీసుకున్న సెల‌వులు కూడా చాలానే ఉన్నాయి. అలాంట‌ప్పుడు అవిశ్రాంతం ఎలా అవుతుంది?

జ‌గ‌న్ విజ‌న్ ఏంట‌నేది సాక్షి కూడా స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయింది. కేవలం విమర్శాలకే పరిమితం అయ్యే జగన్ విజన్ కేవలం ముఖ్యమంత్రి కావటం మాత్రమే. ఒకవేళ అయినా తర్వాత ఏం చెయ్యాలో తెలీదు. కేంద్రం నుండి నిధుల కోసం వత్తిడి తేవటం ,అవసరమైతే పోరాటం చెయ్యటం జగన్ వల్ల కావు. ఎందుకంటె ఇప్పటికీ జగన్ మీద ఈడీ కేసులు నడుస్తున్నాయి. ఆ వత్తిడులకు తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగే తెగువ జగన్ కి లేదు. రాష్ట్ర ఆదాయాని పెంచాం ఎలా యువతకు ఉపాధి కల్పించటం ఎలా.. ప్రిశారమాలు రాష్ట్రానికి తీసుకురావటం ఎలా … ఇలాంటి విషయాల్లో జగన్ కు బిల్ కుల్ నాలెడ్జ్ లేదు. రాష్ట్రంలో ప్ర‌తీ ప‌రిశ్ర‌మ‌లో 75 శాతం ఉద్యోగాలు స్థానిక యువ‌త‌కే అని జ‌గ‌న్ చెప్ప‌డాన్ని గొప్ప విజ‌న్ అని సాక్షి రాసింది! అది ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌చ్చాక చెప్పాల్సిన మాట‌. ముందు జరగాల్సినది తెలీని జగన్ అల కాక ఇంకెలా మాట్లాడతారు.
జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌నీ, అయిపోతున్నార‌నీ, చేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారంటూ రాసిన సాక్షి ఆయన స్పష్టమైన విజన్ ఏంటో రాయలేకపోయింది. చదివిన పాఠకులకు ఇదంతా అధికారం కోసం సొంత డబ్బా అన్న అభిప్రాయాన్ని తెచ్చింది.

Facebook Comments