జగన్ కు దడపుట్టిస్తున్న బాబు జలదీక్ష..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బాబు మరింత స్పీడ్‌గా వ్యవహరిస్తున్నారు.. ఈ ఏడాది బాబుకు కాలం కలిసివచ్చింది. గత నాలుగేళ్లుగా సరైన వర్షాలు పడకపోవడంతో జలాశయాలు నిండలేదు. ఈ ఏడాది సీన్‌ మారింది.. మన రాష్ట్రంలో వర్షాలు పడకపోయినా, పైన కర్నాటక, మహారాష్ట్రలో కురిసిన ఎన్నికలతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నిండుకుండలా మారాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఇదే ఆయనకు ప్లస్‌గా మారింది..

గత నాలుగేళ్లుగా చంద్రబాబు పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తూనే, అభివృద్ధిపైనా ఆయన ప్రత్యేక లెక్కలు వేశారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి జాతికి అంకితం చేసిన చంద్రబాబు, తాజాగా పోలవరంలో గ్యాలరీ వాక్‌ నిర్వహించి కొత్త చరిత్ర లిఖించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం తన జీవితాశయం అన్నారు.. అది ప్రజలకు అందుబాటులోకి వస్తే తన జీవితం ధన్యమవుతుందని ప్రకటించారు చంద్రబాబు.

బుధవారం పోలవరం గ్యాలరీ వాక్‌ పూర్తి చేసిన చంద్రబాబు, శుక్రవారం శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌లకు జలహారతి ఇవ్వనున్నారు. ఇదే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ శిబిరంలో గుబులు రేపుతోంది. నాలుగేళ్లుగా సరైన వర్షాలు లేకపోవడంతో, బాబు కరువుకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని విమర్శించిన జగన్‌ టీమ్‌… తాజాగా వారి నోళ్లు మూతపడ్డాయి. గుంటూరుతోపాటు పల్నాడు, ప్రకాశం జిల్లాలలోని కరువు పరిస్థితులు తమకు కలిసి వస్తాయని భావించిన జగన్‌కి ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు.. మొత్తమ్మీద, చంద్రబాబు జలదీక్ష, జగన్‌కి శాపంలా మారేలా కనిపిస్తోంది..

Facebook Comments