జగన్ కు కొడాలి నాని బిగ్ షాక్.. ఏం చేసాడో తెలుసా..?

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని… ముక్కు సూటిగా మాట్లాడే రాజకీయ నాయకుడు. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా నందమూరి హరి కృష్ణ కుటుంబం అన్నా నానీ కి చాలా ఇష్టం. వాళ్ళ కోసం ప్రాణం పెట్టె రకం నానీ. అయితే తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో కూక‌ట్‌ప‌ల్లి టీడీపీ అభ్య‌ర్థిగా నంద‌మూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపధ్యంలో తన ఇంటి ఆడపడుచులా సుహాసినిని భావించే కొడాలి నాని ఆమె కోసం కూకట్ పల్లి లో ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని జగన్ కు కూడా చెప్పారట నాని. దీంతో జగన్ షాక్ కు గురయ్యారు.

సుహాసినిని పోటీ చేయించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న నిర్ణ‌యం ఇప్ప‌డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు కూడా త‌ల‌నొప్పిగా మారిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీలో కీల‌కంగా ఉన్న కొడాలి నాని సుహాసిని త‌ర‌ఫున కూక‌ట్‌ప‌ల్లిలో ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒకవేళ అదే గనుక జరిగితే వైసీపీలో అంతర్గత లుకలుకలు మొదలయినట్టే . జగన్ కు తన నిర్ణయాన్ని చెప్పిన నానీని వద్దంటే ఊరుకునే రకం కాదు. లేదు వెళ్ళు అంటే టీడీపీ తరుపున ప్రచారం చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇలా ఆలోచించిన జగన్ ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టు తర్వాత మాట్లాడతా అని చెప్పారట. దీంతో ఆ నాయ‌కుడికి స‌ర్దిచెప్ప‌లేక జ‌గ‌న్ త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్లు స‌మాచారం.

టీడీపీ నుండి వైసీపీ కి వచ్చిన కొడాలి నానీ కృష్ణా జిల్లాలో వైసీపీ కీల‌క నేత‌ల్లో ఒక‌రు. వైసీపీ-టీడీపీల మ‌ధ్య బ‌ద్ధ శ‌త్రుత్వం ఉన్నా.. హ‌రికృష్ణ కుటుంబంతో స్నేహాన్ని మాత్రం నాని వ‌దులుకోలేదు. అందుకే ఆయన ప్రచారానికి ఫిక్స్ అయ్యారు. మరి జగన్ నాని చెప్పిన విష‌యంపై జ‌గ‌న్ ఎలా స్పందిస్తారోన‌న్న‌ది ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. వద్దంటే ఊరుకోడు.. పొమ్మంటే అనవసరపు చిరాకు.. ఈ నేపధ్యంలో జగన్ ఆలోచనలో పడ్డారట .

Facebook Comments