జగన్ కు మరో సిట్టింగ్ ఎమ్మెల్యే ఝలక్..సొంత జిల్లాలోనే

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీడీపీ ని దెబ్బ కొట్టటం కోసం ఎవరు వస్తే వాళ్ళను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. చేరేటప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడకపోవటంతో జగన్ పార్టీ లో ఉన్న నేతలు లోలోపల బాధ పడుతున్నారు. కొందరైతే పార్టీ ఫిరాయించి బహిరంగంగా జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పించే జ‌గ‌న్, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ వ‌ల్ల త‌న పార్టీపై ఎటువంటి ఎఫెక్ట్ ప‌డుతుందా అని ఆలోచిస్తున్నాడు. సొంత జిల్లాలోనే ఎదురీదుతున్నాడు.

మైదుకూరులో డీఎల్ తెలుగు దేశంలో చేరితే పార్టీ పరువు పోతుందని భావించిన జగన్ తన తండ్రి చిరకాల మిత్రుడైన డీఎల్ ను పార్టీలో చేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యారు.. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎమ్మెల్యే టికెట్ డీఎల్ ఎంట్రీ ఇస్తే క‌చ్చితంగా సీనియ‌ర్ కాబ‌ట్టి ఆయ‌న‌కు ఇచ్చే అవకాశం వుంది. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డి నాలుగున్న‌ర సంవ‌త్స‌ర కాలంలో తాను నిలబెట్టుకున్న కేడ‌ర్ ను డీఎల్ కు దారాద‌త్తం చెయ్యటానికి సుముఖంగా లేరు. డీఎల్ మాత్రం త‌న సొంత కేడ‌ర్ తో వైసీపీ లో చేరితే ఎలా వుంటుంది,టీడీపీ అయితే ఎలా వుంటుంది అని చ‌ర్చించారు. వైసీపీ లో చేరితే శెట్టిప‌ల్లి స‌పోర్ట్ ఉండ‌దు అని, ఏ పార్టీలోకి మీరు వెళ్లినా టికెట్ వ‌స్తుంది, ఈ స‌మ‌యంలో టీడీపీలో చేరితే మ‌న‌కు లాభం చేకూరుతుంది అని క్యాడర్ తమ అభిప్రాయం చెప్పారు. జగన్ మాత్రం ఎలాగోలా డీఎల్ ను పార్టీ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఒక వేళ డీఎల్ వైసీపీకి వస్తే శెట్టిపల్లి రఘురామిరెడ్డి చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. డీఎల్ రాకపోతేనే శెట్టిపల్లికి సంతోషం.

కడపలో పట్టు కోసం తపన పడుతున్న జగన్ కడపను తండ్రిలానే విస్మరిస్తున్నారనే భావన ప్రజల్లో వుంది. అభివృద్ధి జగన్ తో సాధ్యం కాదు కాబట్టే కడప వాసులు, డీఎల్ క్యాడర్ అందరూ తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతుంది. ఇప్పుడు డీఎల్, శెట్టిపల్లి విషయంలో ఆచితూచి అడుగెయ్యకపోతే జగన్ కు షాక్ తగిలే అవకాశం వుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ల పొగిడిన నోర్లే తిట్టే పరిస్థితి వచ్చేలా వుంది.

Facebook Comments