జగన్ వ్యూహం ఫెయిల్…వచ్చే ఎన్నికల్లో వైసీపీ దుకాణం బంద్

వైసీపీ నేత జగన్ అధికారంలోకి రావటమే లక్ష్యం గా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. నవరత్నాల పేరు తో తాము అధికారంలోకి వస్తే తీసుకునే నిర్ణయాలను కూడా చెప్తున్నారు. జగన్ తన పాదయాత్రలో పదే పదే చెప్తున్న పేరు నవ రత్నాలు. రాష్ట్రంలో అధికారం కోసం జగన్ వ్యూహమే ఈ నవరత్నాల కాన్సెప్ట్. అయితే ఈ తరహా కాన్సెప్ట్ బీహార్ లో నితీష్ కూడా తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. సాత్ నిశ్చయ్ పేరు తో ఏడు నిర్ణయాలను అక్కడ నితీష్ ప్రచారం చేస్తే అవి జనాల్లోకి బాగా వెళ్ళాయి. సాత్ నిశ్చయ్ కాన్సెప్ట్ నితీష్ కు ఫలితాల్లో బాగా లాభించింది. అదే తరహా ప్లాన్ ఏపీలో కూడా వర్కవుట్ అవుతుందని జగన్ భావిస్తున్నారు.అయితే అది అంత సాధ్యం కాదని రాజకీయ వర్గాల భావన.

వైసీపీ అధినేత జగన్ కు నిన్నటిదాకా పని చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ నవరత్నాల కాన్సెప్ట్‌ను ఓ వ్యూహంలో భాగంగా జగన్‌కు సూచించారట. బీహార్‌లో జేడీయూ తరహాలో ఏపీలో వైసీపీ కి కలిసొస్తుందని చెప్పారట.. నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్‌కు పీకే సూచించినట్లు తెలిసింది.అయితే రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం బీహార్ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు పొంతనే లేదు.. బీహార్‌తో పోలిస్తే ఏపీలో రాజకీయ చైతన్యం ఎక్కువ కాబట్టి ఇక్కడ జగన్ పప్పులు ఉడకవని చెప్తున్నారు . పైగా ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో నవరత్నాల అమలు సాధ్యమేనా అనే సందేహాలు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు జగన్ ప్రచారం చేసే ఈ నవరత్నాలను ఎంత వరకు నమ్ముతారనేది కూడా సందేహమేనని అంటున్నారు.

విద్యా, వైద్య రంగానికి పెద్ద పీట వేసినా ఆచరణ సాధ్యం కాని నిర్ణయాలు జగన్ కు ప్రతికూలంగా మారతాయని చెప్తున్నారు . జగన్ ఇచ్చిన హామీలలో మద్యపాన నిషేధం, 45ఏళ్లు నిండిన వారికి పింఛన్లు వంటి హామీల సాధ్యాసాధ్యాలపై రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత చర్చ జరుగుతోంది. కేవలం అధికారం కోసం జగన్ నవరత్నాల కాన్సెప్ట్ అని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ప్రజలు వైసీపీ ని నమ్మేలా లేరు . 2019లో వైసీపీకి అధికారం కష్టమే అని ఏపీలో చర్చ జోరందుకుంది.

Facebook Comments