జనసేన పై మంత్రి కామెంట్… జనసైనికులకు షాక్ ఇచ్చేలా..

జనసెన పార్టీ, బీజేపీ తో పోత్తు పై  వైసీపీ మంత్రి స్పందించాడు. ఆయన జనసెన పై  పలు రకాల కామెంట్లు చేశాడు.ఏపీీలో బీజేపీ-జనసేన పొత్తుపై మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్‌కు మించిన రాజకీయ అవకాశవాది ఇంకొకరు ఉండరని విరుచుకుపడ్డారు. బీజేపీకి ఎందుకు లొంగిపోయారని.. ఎవరి కోసం ఆ పార్టీతో పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు నాని. పవన్ కల్యాణ్ చెప్పేదొకటి చేసేదొకటన్న ఏపీ మంత్రి..

 

ఆయన మాటకు విలువే లేదని ధ్వజమెత్తారు. రాజకీయపార్టీని OLXలో అమ్మకానికి పెట్టిన సైద్ధాంతికవేత్త అంటూ ఎద్దేవా చేశారు పేర్నినాని.
కాగా, ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయోజనాల కోసమే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు తెలిపారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని చోట్లా కలిసి పనిచేస్తామని చెప్పారు. బలమైన, సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలనను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 2024లో ఏపీలో జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.