జనసేన కీలక నేత టికెట్ల అమ్మకాల వ్యవహారం……. ఆధారాలతో ఉతికి ఆరేసిన జర్నలిస్ట్

జనసేనలో టికెట్లు అమ్మకానికున్నాయా? జన సేనాని టికెట్ ఇవ్వాలంటే అక్కడ ఆర్ధిక లావాదేవీలు జరుగుతాయా.. ? ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ టికెట్ల వ్యవహారంపై ప్రశ్నించిన మూర్తి మహా టీవీ నుండి బయటకు రావాల్సి వచ్చింది. కానీ జనసేనలో ఓ కీలక నేత టికెట్ల అమ్మకాల భాగోతంపై సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ రాసిన కథనం సైతం ఇప్పుడు వైరల్ గా మారి జనసేన పరువు తీస్తుంది.

పవన్ కళ్యాణ్ సొంత జిల్లా నెల్లూరు నుంచి కొంత కాలం క్రిందట జనసేన లో జాయిన్ అయినా సినియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత జనసేన కో-ఆర్డినేటర్ మాదాసు గంగాధరమ్ గురించి నెల్లూరు జిల్లాకి చెందిన ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో రాసిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన గంగాధరమ్ పవన్ కల్యాణ్ తండ్రికి స్నేహితుడు కూడా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్న మాదాసు గంగాధరమ్ ను పవన్ తన పార్టీలో చేర్చుకున్నాడు. జనసేన కో-ఆర్డినేటర్ గా నియమించారు.
ఈ గంగాధరం చరిత్రపై జర్నలిస్ట్ కథనం చూస్తే ఆయన కాంగ్రెస్లో ఉండగా టికెట్స్ అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయని , ఆయన్ను ఇప్పుడు కో ఆర్డినేటర్ గా నియమిస్తే ఏమి జరుగుతుందో ఊహించుకోగలం అని సెటైర్లు వేస్తున్నారు.

ఒకప్పటి కాంగ్రెస్ పాత కాపు మాదాసు గంగాధర్ అందరి కంటే ముందు తొలి నాయకుడిగా జనసేన లో ఎంట్రీ తీసుకున్న నాయకుడి గా స్థానికులకు తెలుసు. నెల్లూరు జిల్లాకి చెందిన ఈ మాదాసు గంగాధరం ఒకప్పుడు నెల్లూరు లో కాకలు తీరిన నల్లపురెడ్ల దగ్గర రాజకీయ జీవితం మొదలెట్టాడు. నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి అలియాస్ శీనయ్య యువజన సంఘం అధ్యక్షుడిగా జీవితం మొదలెట్టి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి లెవెల్ కి ఎదగ గలిగారు. శీనయ్య దగ్గర రాజకీయం నేర్చుకొని ఆయన చేసిన పరిచయాల తో చిన్న గా ఎదిగి మర్రి చెన్నారెడ్డి వర్గం లో చేరిపోయాడు. మర్రి చెన్నారెడ్డి కి శీనయ్య కి గొడవలు పెట్టి వారిద్దరి మధ్య దూరం పెంచాడు.

1989 ఎలక్షన్స్ లో అప్పటి PCC ప్రెసిడెంట్ గా ఉన్న మర్రి చెన్నారెడ్డి నేతృత్వం లో కలెక్షన్స్ ఏజెంట్ గా మెలిగాడు. ఢిల్లీ లో కాంగ్రెస్ టికెట్స్ లక్షలు లక్షలు ముడుపులు తీస్కొని అభ్యర్థులకు అమ్మిన వారిలో ఈయన ఒకరు. దీనితో ఆగ్రహించిన కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి, తల పండిన తెలంగాణ నేత అని కూడా చూడకుండా చెన్నారెడ్డి ఇంట్లోకి దూరి ఆయనకి దేహశుద్ది చేశారు. దీనికి ఒక రకంగా మన మాదాసు గంగాధర్ గారే కారణం. ఆలా రెండవ రాజకీయం గురువు ఋణం కూడా తీర్చేసుకొని ఇప్పుడు కొత్తగా పవన్ పంచన చేరాడు. ఆ కాలం లోనే టికెట్స్ అమ్మిన అనుభవం తో పవన్ కి అల్లు అరవింద్ లేని లోటు తీరుస్తాడా లేక చెన్నారెడ్డి కి తన్నులు తెచ్చినట్టు తెస్తాడో కాలమే నిర్ణయించాలి. అని వైరల్ అవుతున్న ఈ కథనాన్ని బట్టి జన సేనాని పరిస్థితి భవిష్యత్ లో ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. పక్కా టికెట్లు అమ్మకం లో నిష్ణాతుడైన ప్రబుద్దుడిని పక్కన పెట్టుకుంటే ఇలాంటి చర్చే జరుగుతుంది.
ఇప్పటికే మహాటీవీలో వచ్చిన కథనాలతో జనసేన ఆర్ధిక లావాదేవీలు ఎలా ఉంటాయో చూసిన జనాలకు జనసేన టికెట్ల అమ్మకాల గురించి వింటే పెద్దగా ఆశ్చర్యం కలగదు. ఇప్పుడు ఈ కథనం సంచలనం కావటంతో జనసేన పరిస్థితి ఎటు దారి తీస్తుందో మరి. పవన్ ఫ్యాన్స్ కొట్టిపారేసినా సరే జనసేన టికెట్ల అమ్మకాలకు ఈయన నేపధ్యమే సాక్షి అని చెప్పిన జర్నలిస్ట్ జనసేన ను ఉతికి ఆరేశాడు.

Facebook Comments