జనసేన కొత్త ప్లాన్.. బిజేపి ని బాగానే వాడుతుందిగా..?

రాష్ట్రంలో వైసీపీ అలాగే టీడీపీ  తర్వాత ఎపీ ప్రజలకు మూడవ ప్రత్యామ్యాయం అనేదే లేదు.. అందుకే ఇప్పుడు అలాంటి అవకాశం కోసం జనసేన, అలాగే బీజేపీ ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నారు.ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్లాన్ చేస్తున్న జనసేన-బీజేపీ పార్టీలు తమ భవిష్యత్తు కార్యాచరణకి బలమైన పునాదులు వేసుకున్తున్నాయి.ఉమ్మడి కార్యాచరణతో ఏపీలో ప్రభావం చూపించి, ఈ నాలుగేళ్లలో ప్రజలకి వీలైనంత వేగంగా చేరువ కావాలని భావిస్తున్నారు.దానికి స్థానిక సంస్థల ఎన్నికలని లక్ష్యంగా చేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే మరో వైపు తెలంగాణలో బీజేపీకి కొంత పోజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయి.దీనిని పవన్ కళ్యాణ్ చరిష్మాతో మరింత పెంచుకోవడానికి రెడీ అవుతున్నారు.దీనికోసం కార్యాచరణని సిద్ధం చేశారు.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సిఏఏని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.దీనిని అమలు చేసేది లేదని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేసేసారు.

 

అయితే తెలంగాణలో హిందుత్వ వాదం బలంగా ఉంది.ఈ నేపధ్యంలో చాలా మంది ప్రజలు సిఏఏకి మద్దతు తెలుపుతున్నారు.ఈ నేపధ్యంలో సిఏఏని ముందు పెట్టి తెలంగాణలో రాజకీయ ఎత్తుగడలు వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది.దానికోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తుంది.మార్చి మొదటి వారంలో ఈ సభని హైదరాబాద్ వేదికగా ఏర్పాటు చేసి సిఏఏకి మద్దతుగా ప్రజలని హిందువులని ఒక తాటిపైకి తీసుకురావాలని భావిస్తుంది.పవన్ కళ్యాణ్ ఇప్పటికే పౌరసత్వ బిల్లుకి మద్దతు తెలిపిన నేపధ్యంలో, తెలంగాణ ప్రజల నుంచి ఈ సభకి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే పవన్ కళ్యాణ్ చరిష్మాతో తమ నినాదం బలంగా ప్రజల్లోకి వెళ్తుందని కూడా అనుకుంటుంది.