జనసేన పై భారి కుట్ర..అంతా ప్లానింగే..?

రాష్ట్రంలో జనసెన పై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ ఈసారి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రంగా కూడా ప్రభావం చూపనటువంటి జనసేన అనే పార్టీ పై తీవ్ర స్థాయిలో విషం కక్కుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే తిమ్మిని బమ్మి చేసే విధంగా అనేక రకాల విష ప్రచారాలు చేసినా జనసేన శ్రేణులు వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టారు.కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సహా కార్యకర్తల ఆగడాలు మరీ మితి మీరిపోయాయి.తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలకు గనుఁ క్షమాపణ చెప్పాలని అక్కడి జనసేన నాయకులు మహిళలు అలాగే భీమిలి అభ్యర్థి పంచకర్ల సందీప్ లు వెళ్లి ద్వారంపూడి ఇంటి వద్ద శాంతియూథా నిరసన తెలిపే ప్రయత్నం చెయ్యగా వారిపై పోలీసు వ్యవస్థ వ్యవహరించిన తీరు అమానుషం.

 

దానికి తోడు కొంత మంది రౌడీల్లా విరుచుకుపడ్డారు.ఇది మాత్రం గమనార్హం,కానీ ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది అని అక్కడ ఈ ఘటనలు చూసిన వారు అంటున్నారు.డాక్టర్ సందీప్ మరియు కాకినాడ జనసేన నాయకులూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతామని పార్టీ కార్యకర్తలు అక్కడకి రావాలని కోరారు.దీనితో వైసీపీ నేతలు కొంతమందిని పురమాయించి పోలీసుల సహకారంతోనే ఈ దాడులకు పాలప్పడ్డారని తెలుస్తుంది.ముందుగానే ఒక తువ్వాలుతో గాజుపెంకులు పగలగొట్టి వాటిని ముద్దలా అందులో చుట్టి జనసేన నాయకులపై విసరడం సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మెల్లగా పక్కకి జారుకోవడం వంటివి ఇదంతా పక్కా పథకం ప్రకారమే జరిగింది అని జనసేన కార్యకర్తలు అంటున్నారు.మరి ఇది రాజన్న రాజ్యమా లేక రౌడీ రాజ్యమా అన్నది ప్రతి ఒక్కరు ఓసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.