టీఆర్ఎస్ లోకి మరో నటి ..? చక్రం తిప్పిన కేటీఆర్ ..?

అయినోళ్లకు ఆకుల్లోను కానోళ్ళకు కంచాల్లోనూ అన్నట్టుగా తయారయిపోయింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ముందస్తు ఎన్నికల తొందర్లో అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా హడావుడిగా 105 మంది పార్టీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించి పార్టీలో గుబులు రేపాడు గులాబీ బాస్. ఎప్పటినుంచో పార్టీ కోసం పనిచేస్తున్నామని టికెట్ మీకే మీకే అంటూ చివరిగా మొండి చెయ్యి చూపారని అణూలనలు ఒకవైపు జరుగుతున్నాయి. దీనికి కారణం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అందరిని కారు ఎక్కించేసుకోవడం తో ఈ పరిస్థితి వచ్చింది. అయినా ఉన్న జనం సరిపోనట్టు ఇంకా మరికొంతమందిని కారెక్కించుకునేందుకు గులాబీ బాస్ ప్రయత్నిస్తున్నాడు.

కొద్దీ రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి టీఆర్ఎస్ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సీనియర్ ప్రముఖ నటి ఆపార్టీలో చేరుతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. సహజన నటిగా పేరు తెచ్చుకున్న జయసుధ గులాబీ పార్టీలో చేరుతున్నారనే వార్తలు ఇప్పుడు తెలంగాణాలో గుప్పుమంటున్నాయి. ఆమెను టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా పార్టీ అధినేతలే స్వయంగా ఆహ్వానించారు.రాష్ట్ర మంత్రి కె తారకరామారావు ఇటీవల ఆమెకు స్వయంగా ఫోన్ చేసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం.

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమెను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటే పార్టీకి కొంత ప్రయోజనం కలుగుతుందనే ఆలోచనతో టీఆర్‌ఎస్ లో చేరాలని కేటీఆర్ ఆహ్వానించినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే కేటీఆర్ ఆహ్వానంపై ఆలోచించి చెబుతానని జయసుధ చెప్పారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న జయసుధ, క్రియాశీలక రాజకీయాలకు గత కొంత కాలంగా దూరంగా ఉన్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరేది ఇంకా స్పష్టమైన క్లారిటీ అయితే రాలేదు. ఒక వేళా ఆమె చేరిక లాంఛనమే అయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది తేలాల్సి ఉంది.

Facebook Comments