హరికృష్ణ విషయంలో రాజీవ్ పై ఫైరయిన ఎన్టీఆర్ … వెనుక అంత కథ ఉందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల పై ఫైర్ అయ్యాడు. అందుకే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించినా ఓదార్చటానికి రాలేదట.. అసలు ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుడైన రాజీవ్ కనకాలపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు అంటే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – న‌టుడు రాజీవ్ క‌న‌కాల వీరి స్నేహం గురించి తెలీని వారుండరు. ప్రాణ స్నేహితులు. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక‌ ముందు నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ ఎక్క‌డికి వెళ్లినా వెంట రాజీవ్ కూడా ఉంటాడు. అప్ప‌ట్లో ఎన్టీఆర్ పొలిటిక‌ల్ క్యాపెనింగ్ లోనూ రాజీవ్ చురుకుగా పాల్గొన్నాడు. ఎన్టీఆర్ న‌టించిన చాలా సినిమాల్లోనూ రాజీవ్ న‌టించాడు. ఎన్టీఆర్ కు కార్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా రాజీవ్ పక్కనే వున్నాడు.రాజీవ్ కు ఇప్ప‌టికీ అవ‌కాశాలు వ‌స్తున్నాయంటే ఎన్టీఆరే కార‌ణం .అంత‌టి ప్రాణ స్నేహితుడు తండ్రిని కోల్పోయి ఒంట‌రిగా బాధ‌ప‌డుతుంటే క‌నీసం ఓదార్చ‌డానికి కూడా రాజీవ్ రాలేదు. హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త తెలుసుకుని ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ఆసుప‌త్రికి చేరుకుంది.ఆ త‌ర్వాత హ‌రికృష్ణ బాడీని ఇంటికి తీసుకొచ్చిన‌ప్పుడు గానీ, అంతిమ యాత్ర‌లో గానీ రాజీవ్ క‌న‌కాల ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అంద‌రూ రాజీవ్ ఏమైపోయాడ‌ని గుసుగ‌సులాడుకున్నారు. ఎన్టీఆర్ తో ఏదైనా వివాదం త‌లెత్తి దూరంగా ఉన్నాడా? అని రూమ‌ర్లు మొద‌ల‌య్యాయి. తాజాగా అస‌లు విష‌యాలు ఏంట‌న్న‌ది ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

హ‌రికృష్ణ‌కు యాక్సిడెంట్ అయిన స‌మ‌యంలో ఏదో సినిమా షూటింగ్లో భాగంగా విదేశాల్లో ఉన్నాడు రాజీవ్ కన‌కాల . హరికృష్ణ మరణవార్త విన్న రాజీవ్ ఇండియా కు బయలుదేరాడు. ఫోన్ చేసి ఎన్టీఆర్ ను ఓదార్చే ప్రయత్నం చేసిన రాజీవ్ ఇండియా వస్తా అంటే ఎన్టీఆర్ వద్దని వారించాడట…నువ్వు వ‌చ్చి చేసేదేముంది. జ‌ర‌గాల్సిన నష్టం జ‌రిగిపోయింది. నువ్వు ఇండియా వ‌చ్చేస్తే నీవ‌ల్ల‌…నా వ‌ల్ల నిర్మాత‌లు ఇబ్బందుల్లో ప‌డ‌తారు. వీలు చూసుకుని రా! అన్నాడట ఎన్టీఆర్. అయినా రాజీవ్ వినకుండా బయలుదేరి ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాక ఎన్టీఆర్ కోపం వ్యక్తం చేసాడట …నేనే షూటింగ్ వెళ్ల‌డానికి సిద్ద‌మ‌వుతున్నా! నువ్వొచ్చి ఏం చేస్తావ‌ని! గ‌ట్టిగా అరిచాడట‌. దీంతో రాజీవ్ నిర్ణ‌యం మార్చుకుని తిరిగి వెన‌క్కి వెళ్లిపోయాడట‌. రీసెంట్ గా రాజీవ్ ఎన్టీఆర్ ను క‌లిసి ఓదార్చిన‌ట్లు తెలుస్తున్న నేపధ్యంలో ఈ విషయం తెలిసింది . రాజీవ్ రాకపోవటం వెనుక ఎన్టీఆర్ కోపం వెనుక అంత కథ వుంది.

Facebook Comments