రాజయ్యకు షాక్ ఇస్తున్న కడియం వర్గం…కడియం పై వేటు వేస్తారా…?

తాటికొండ రాజయ్య …ఆయన తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా చాన్స్ కొట్టేశారు. ఒక వెలుగు వెలుగుతాననుకున్న ఆయన్ను రాజకీయంగా చావు దెబ్బ కొట్టారు. ఫలితంగా మంత్రి పదవి ఊడింది. అప్పటి నుండి ఇప్పటికీ ఆయన చుట్టూ వివాదాలే. ఆయన వ్యవహారంపై విమర్శలే.. ఆయన రాజకీయ జీవితంలో ఆయనకు తగులుతున్న షాక్ లకు కారణం కడియం శ్రీహరి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కూడా టికెట్ విషయంలో రాజయ్యకు వద్దని శ్రీహరికి కానీ, కడియం కావ్యకు కానీ టికెట్లు ఇవ్వాలని అందుకున్న అసమ్మతి మంటలు రాజయ్యను దహిస్తూనే ఉన్నాయి.

స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గ పార్టీ శ్రేణులు రాజయ్య అభ్యర్థిత్వాన్ని నిరాకరించారు.అభ్యర్థిని మార్చాలని కోరినా అభ్యర్థి మార్పు ససేమిరా అన్నారు కేటీఆర్ . దీంతో టీఆర్ఎస్ అధిష్టానానికి, రాజయ్యకు షాకుల మీద షాకులిస్తుంది కడియం వర్గం. దీంతో రాజయ్య ఓటమి ఖాయంగా కనిపిస్తుంది.కేసీఆర్ ప్రకటించిన తొలి అభ్యర్థుల జాబితాలో స్టేషన్ ఘన్ పోర్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కింది. టికెట్ ఎలాగోలా సంపాదించిన రాజయ్య కు కడియం వర్గం నుండి అసమ్మతి సెగ మొదలైంది. తన భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తెలుసుకున్న కడియం శ్రీహరికి పాదాభివందనం చేసి సహకరించాలని కోరుకున్నారు. అంతేకాదు కేటిఆర్ తో జరిగిన మీటింగ్ లో కూడా గతంలో తాను చేసిన అన్ని తప్పులకు బహిరంగ క్షమాపణ చెప్పుకుంటున్నాని, ఎలాగైనా ఈసారి తనను గెలిపించాలని వేడుకున్నారు. అంతేకాకుండా ఒక సభలో తనకు అయిన వాళ్లే అన్యాయం చేశారని బోరున ఏడుస్తూ కంటతడి పెట్టారు. ఆయనతోపాటు జనగామ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా ఏడ్చారు. ఈ పంచాయితీని డీల్ చేసిన కేటీఆర్ రాజయ్య నే తమ అభ్యర్థి అని అందరూ సహకరించాలని చాలా సీరియస్ గా చెప్పారు. ఒకవేళ ఎవరైతే అధిష్టాన నిర్ణయానికి వ్యరేఖంగా పోతారో వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

అయినా సరే స్టేషన్ ఘన్ పూర్ లో రాజయ్య కు, కడియం వర్గం సహాయ నిరాకరణ చేస్తుంది. ప్రచారానికి దూరం గా వుంది. ప్రజల్లో వ్యతిరేఖత ఉందని చెప్పినా పట్టించుకోని అధిష్టానానికి కూడా షాక్ ఇవ్వనుంది. రాజయ్య ప్రచారాల్లో ఎవరూ పాల్గొనేది లేదని తీర్మానించింది. చివరి నిముషం వరకు కడియం కావ్య కోసం టికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేయ్యనుంది. లేకుంటే పోటీలో ఉన్న వారిని బట్టి రాజయ్యకు కాకుండా వేరే పార్టీ వాళ్లకు సహకారం అందిస్తామని తెగేసి చెప్తుంది. కాదు కూడదు అంటే మూకుమ్మడిగా రాజీనామా చేసి పోతామని హెచ్చరిస్తుంది కడియం వర్గం. ఇదంతా కడియం కనుసన్నల్లోనే జరుగుతుంది. కడియం వర్గం చేస్తున్న ఈ ఆందోళన ఆపటం లేదు కాబట్టి కడియం పై వేటు వేస్తారా… లేకా రాజయ్యకు సహకరించమని తీర్మానం చేసిన కడియం వర్గం టీఆర్ఎస్ నాయకులపై వేటు వేస్తారా అని ప్రస్తుతం నియోజకవర్గం లో చర్చ జరుగుతుంది. మొత్తానికి వీళ్ళ పంచాయితీతో రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో దెబ్బ పడుతుంది అని స్థానికులు చెప్పుకుంటున్నారు.

Facebook Comments