వైసీపీ పై షాకింగ్ కామెంట్ చేసిన కన్నా లక్ష్మీనారాయణ…

ఏపీలో ఇసుక వారోత్సవాలు జరిపి ప్రభుత్వం ఏం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించిందేనని ఆయన విమర్శించారు. ఇసుక కొరతకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇసుక అందుబాటులో లేకుండా చేయడం వెనుక కుట్ర ఉందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

అధికార వైసీపీ తీరుతో ప్రజలతో పాటు నాయకులు కూడా విసిగిపోయారని ఆయన అన్నారు.ఐదు నెలలకే విసిగిపోయిన వైసీపీ నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని కన్నా వ్యాఖ్యానించారు.వల్లభనేని వంశీ టీడీపీ నేతలపై పరుష పదజాలంతో విమర్శించడంపై కన్నా స్పందించారు. నేతలు రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని హితవు పలికారు. నాయకుడు నోరు పారేసుకుంటే చులకన అవుతారని వ్యాఖ్యానించారు.