షాకింగ్… కౌశల్ ఆర్మీ ని వదలని కత్తి మహేష్.. అంత మాట అనేశాడేంటీ…?

బిగ్ బాస్ సీజన్2 మొదలైన దగ్గర నుండి సోషల్ మీడియాలో హల్ చల్ మొదలయ్యింది. మొదట దీప్తి సునయన ఆర్మీ వుండేది. కౌశల్ ఎప్పుడైతే హౌస్ లో ఏడుస్తూ ఫ్యామిలీ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టాడో అప్పుడే క్రమంగా కౌశల్ ఆర్మీ బయటకు వచ్చింది. ఇంట్లో ఒంటరిపోరాటం చేస్తున్న కౌశల్ కు ఈ ఆర్మీ భయంకరంగా సపోర్ట్ చేస్తుంది. కౌశల్ ని ఎలిమినేషన్ నుండి కాపాడడం, అతడికి అత్యధిక ఓట్లు నమోదయ్యేలా చూడడం వంటివి చేస్తుంది.

గతంలో ఈ షో లో పాల్గొన్న బాబు గోగినేని ఈ కౌశల్ ఆర్మీ అంతా డబ్బిచ్చి చేయించే ప్రచారం అని ముందే వేసుకున్న ప్లాన్ అని చెప్పి దుమారం రేపారు.. తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేష్ కూడా ఈ ఆర్మీ పై స్పందించటం దుమారం రేపింది. . ”అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. బిగ్ బాస్ కి వచ్చిన తరువాత అందరూ కుటుంబ సభ్యుల్లా మెలగాలి. హౌస్ మేట్స్ లో కొందరు కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు అలా అని ట్రోల్ చేస్తారా..?. తమకి నచ్చని వారిపై కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం కరెక్ట్ కాదు. అని కత్తి వ్యాఖ్యలు చేసారు.

కౌశల్ కి ఒక్కడికే కాదు కౌశల్ కి ఉన్నట్లే మిగిలిన కంటెస్టెంట్స్ కి కూడా కుటుంబాలు ఉంటాయి. వారికి ఈ ట్రోలింగ్ లు బాధ కలిగిస్తాయి. కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోందన్నారు . అసలు ఈ కౌశల్ ఆర్మీ ఎవరికి సైన్యం..? ఎవరి కోసం సైన్యం..? అనేది అర్ధం కావడం లేదు. ఎవరీ కౌశల్.. బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండొచ్చు.. నాకు నచ్చలేదు అలాగని ట్రోల్ చేస్తారా..? ఇటీవల ఆయన పేరు మీద 2కె రన్ చేశారు.కేరళ వరద బాధితుల కోసం అలా చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అందేవి అని చెప్పిన కత్తి వ్యాఖ్యలు కౌశల్ ఆర్మీ చెవిన పడితే ఏం చేస్తారో మరి.. కత్తి కూడా వివాదాలకు ఏ మాత్రం భయపడే వ్యక్తి కాదు కాబట్టి ఈ గొడవ ఎక్కడి దాకా పోతుందో అనే చర్చ జోరుగా సాగుతుంది.

Facebook Comments