కేసీఆర్ అంటే బండ్ల గణేష్ కు అంత భయమా?ఎందుకిలా..?

బండ్ల గణేష్ అంటే నిన్నటి వరకూ సినీ నిర్మాతగానే తెలుసు. కానీ ఇప్పుడు బండ్ల గణేష్ ఒక రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ నేత. తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ప్రజా క్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏకంగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

తన అభిమాన ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరి బండ్ల గణేష్ పవన్ తో సహా అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పై పోరాటం చేసినా పవన్ దేవుడని చెప్పే గణేష్ మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీలోనే చేరి పోటీ కి సై అంటున్నాడు. రాజకీయాల్లో చేరాక ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ప్రతిపక్ష టీఆర్ఎస్ ను విమర్శించాలి. కేసీఆర్ ను తిట్టాలి అంటే నా వల్ల కాదు బాబోయ్ అంటున్నాడు. బండ్ల గణేష్ కేసీఆర్ పేరు చెప్తే ఎందుకు భయపడుతున్నాడు. ఒక చానల్ ఇంటర్వ్యూ లో కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి నాకెక్కడిది సార్.. అంటూ తన భయాన్ని వ్యక్తం చేశారు బండ్ల గణేష్ . కాంగ్రెస్ నాయకుడిగా కేసీఆర్ ను విమర్శించరా అంటే దీనికి బండ్ల అప్పుడేమో కానీ.. కేసీఆర్ గారి స్థాయి ఏంటి.? అతను లెజండరీ మ్యాన్..ఆయన్నెందుకు విమర్శిస్తాను.. అంటూ తప్పించుకున్నారు. కేసీఆర్ గారు బాగా చేయకపోతేనే కాంగ్రెస్ తరఫున తాము పోరాడుతామంటూ వివరణ ఇచ్చారు.

చివర్లో కేసీఆర్ ను తిట్టడానికి బండ్ల భయపడిపోతున్నాడా అంటే గణేష్ తాను కాంగ్రెస్ లో చేరినప్పుడే చావుకు భయపడలేదని.. అధికార పక్షం కేసులు పెట్టినా.. జైలుకు పంపినా.. చంపేసినా తాను రెడీ అంటూ భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవాన్ని వ్యక్తం చేశాడు. కేసీఆర్ అంటే అంత భయమున్న బండ్ల.. కాంగ్రెస్ నేతగా కేసీఆర్ ను ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న . బండ్ల గణేష్ ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే కాక ఆ ఇంటర్వ్యూ ను చూసిన ప్రేక్షకులు సైతం బండ్ల గణేష్ కు ఇంత భయమా .. కేసీఆర్ అంటే ఎందుకిలా వణికిపోతున్నాడు. ఇలా అయితే కష్టమే అని చర్చించుకుంటున్నారు.

Facebook Comments