జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్…

కేసీఆర్ ఎపీ తీరుపై సంచలన వ్యాఖ్యల్యు చేశాడు. అసలు అర్టీసీ ని ఏవరైన విలినం చేస్తారా అని ప్రశ్నించాడు.ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనంకు ఓ ఆర్డర్ ఇచ్చి.. కమిటీ మాత్రమే వేశారు. అక్కడేమీ జరగదు. ఏం జరుగుతుందో.. మూడు నెలలకో.. ఆరు నెలలకో తేలుతుందని… కేసీఆర్ అన్న మాటలు ఏపీ ప్రభుత్వాన్ని సూటిగానే తగిలినట్లుగా ఉన్నాయి. వెంటనే… ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఓ కమిటీని నియమించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్‌ను నియమిస్తూ జీవో జారీ చేశారు. ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయ శాఖల అధికారులతో గ్రూప్‌ ఉంటుంది..

ప్రజా రవాణాశాఖ ఏర్పాటు, పోస్టులు, డిజిగ్నేషన్ల ఏర్పాటుపై.. వర్కింగ్ గ్రూప్ దృష్టి సారిస్తుంది. జీతాల చెల్లింపు, పే-స్కేల్ విధి విధానాలు ఖరారు చేస్తారు. వచ్చే నెల 15లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ విలీనం .. అసాధ్యం.. అసంభవం అంటూ… కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసే సందర్భంలో.. ఏపీలో చేస్తున్నారు కదా.. అన్న ప్రశ్న.. జర్నలిస్టుల నుంచి వచ్చింది. ఆ సమంయలో.. ఏపీలో కూడా సాధ్యం కాదని చెప్పడానికి ఆయన తనదైన లాంగ్వేజ్ ఎంచుకున్నారు. అయితే.. ఏపీ సర్కార్.. విలీనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో విలీనం చేసి తీరుతామని ప్రకటించారు. ఇప్పటికి ఐదు నెలలు అయింది. అయితే.. విలీనానికి నిర్ణయం తీసుకుని.. ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే నెలతో పూర్తి చేసి.. జనవరి నుంచి ప్రభుత్వం తరపునే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలివ్వాలన్న పట్టుదలతో ఉన్నారు. తాము ఇంతగా ముందడుగు వేస్తున్నా.. కేసీఆర్ తేలిగ్గా తీసేయడం ఏపీ సర్కార్ కు నచ్చినట్లుగా లేదు. అందుకే.. వెంటనే వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఏపీలో ప్రత్యేకంగా ప్రజారవాణా విభాగం ఏర్పాటు చేసి… అందులో ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేయనున్నారు. ఆర్టీసీ .. ఆర్టీసీలాగే ఉంటుంది. ఉద్యోగులు.. ఆర్టీసీకే పని చేస్తారు. కానీ జీతాలు మాత్రం… ప్రభుత్వం ప్రజల పన్నుల రూపంలో కట్టే సొమ్మును చెల్లిస్తుంది.

అంటే… ఉద్యోగులు ఆర్టీసీకి పని చేస్తారు. కానీ జీతాలు మాత్రం ఆర్టీసీ చెల్లించదు. ఆర్టీసీని సాంకేతికంగా.. ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యం.అందుకే.. ఉద్యోగుల్ని విలీనం చేసి.. జీతభత్యాల ఖర్చు భరించడం మినహా మరో మార్గం లేదని జగన్ భావించి.. దాన్నే పూర్తి చేస్తున్నారు. కేసీఆర్ కు ఇది ఇబ్బందికరంగా మారింది. పేద రాష్ట్రం ఏపీ చేస్తూంటే… ధనిక రాష్ట్రం తెలంగాణ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. అందుకే.. ఏపీలో కూడా జరగదని అంటున్నారు. కానీ కేసీఆర్ మాటలను… చేతలతోనే… తప్పని నిరూపించాలని జగన్ అనుకుంటున్నారు