కేసీఆర్ కొరివితో తల గోక్కుంటున్నారా ..అందుకే కేసీఆర్ కు అక్కడ దెబ్బ పక్కానా..?

కేసీఆర్ కొరివితో తల గోక్కుంటున్నారా? తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి నని మరిచి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారా? ఆంధ్రా తెలంగాణా అంటూ లేని భేషజాలను తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారా ? అంటే అవుననే చెప్తున్నారు తెలంగాణలో ఉంటున్న ఆంధ్రా సెటిలర్స్ మరియు సానుభూతిపరులు.తెలంగాణా రాష్ట్రం రాక ముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడితే చాలు ఆంధ్రోళ్లు అంటూ విరుచుకుపడేవారు. తెలంగాణాను దోచుకుంది ఆంధ్రోళ్లు అని ఆంధ్రోళ్ళ నాలుకలు తెగ్గోస్తా అని తీవ్ర పరుషమైన పదజాలం తో దూషించే వారు. తరిమి తరిమి కొడతామని హెచ్చరించేవారు. అదేమంటే దోపిడీ చేసింది ఆంధ్రా వాళ్ళే అంటూ సామాన్య ఆంధ్రా ప్రజలకు కూడా ఆపదిన్చేవారు. దీంతో తెలంగాణా ప్రాంతంలో నివసించే ఆంధ్రా ప్రజలు వివక్షకు గురయ్యారు. మానసిక వేదన అనుభవించారు.

ఎప్పుడైతే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరిగిందో కేసీఆర్ కాస్త శాంతించారు. ఇక్కడ ఉన్న సెటిలర్స్ జోలికి పోలేదు. మాటల వాడి వేడి కూడా బాగా తగ్గించారు. అప్పట్లో రాష్ట్రం కోసం ఆవేశం లో మాట్లాడారు అని భావించిన ఆంధ్రా సెటిలర్స్ సైతం ఇక అలాంటి గొడవలేమీ ఉండవని భావించారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నందుకు కేసీఆర్ కు సైతం వారు సహకరించారు. దాని ఫలితమే హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సెటిలర్స్ ఉన్న చోట కూడా కేసీఆర్ కు పట్టం కట్టారు.

ఇప్పుడు ముందస్తు ఎన్నికల వేళ మహాకూటమి పొత్తుల నేపధ్యంలో మళ్ళీ కేసీఆర్ ఆంధ్రా వాళ్ళ మీద దాడిని ప్రారంభించారు.
తెలంగాణాను నాశనం చేసింది ఆంధ్రా వాళ్ళేనని, చంద్రబాబు కు ఓటెయ్యటం అంటే ఆంధ్రా వాళ్ళ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టటమేనని చాలా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ప్రతి ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రా వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. ఎవరేమి అన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా హైదరాబాద్ అభివృద్ధికి కారణం మాత్రం నాటి ఆంధ్రా పాలకులే . అయినా కేసీఆర్ మీద సానుకూల భావంతో ఉన్న సెటిలర్స్ మనసులో మళ్ళీ అభద్రతా భావం కలిగిస్తే హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర ఏర్పాటు జరిగినా కూడా ఇంకా ఎంత కాలం ఆంధ్రా వాళ్ళను తిడుతూ పబ్బం గడుపుకుంటారని భావిస్తున్న వాళ్ళు కేసీఆర్ కు షాక్ ఇస్తారని చెప్తున్నారు రాజకీయ వర్గాలు. మొత్తానికి కేసీఆర్ ‘ఆంధ్రా’ పదాన్ని వాడుతూ తిడుతూ, నిరంతరం దూషిస్తూ ఆంధ్రా పాలకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పెట్టుకుంటున్న ఆంధ్రా పంచాయితీ కొరివితో తల గోక్కోవటమే అవుతుందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Facebook Comments