కేసీఆర్ ను కడిగేసిన కొండా సురేఖ…. ఇంతగా తిట్టారేంటి?

కొండా సురేఖ మరో సారి కేసీఆర్ కుటుంబంపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన సురేఖ ఆ లేఖను చదివి వినిపించారు.ఓటమి భయంతోనే ముందస్తుకు వెళుతున్నారు అన్న సురేఖ ధనికులకే మేలు చేసేలా పాలించారన్నారు. ఒక తుగ్లక్ పాలన కేసీఆర్ పాలన అని చెప్పిన సురేఖ ఇంతవరకు తన ప్రశ్నకు సమాధానం ఇవ్వని అధిష్టాన వైఖరిని దుయ్యబట్టారు.తనకు టికెట్ ఇవ్వకపోవటానికి గల కారణాలను చెప్పాలని కోరిన సురేఖ కు అధిష్టానం నుండి ఎలాంటి సమాధానం రాకపోగా ఎదురు దాడి జరుగుతున్న నేపధ్యంలో మరోసారి కొండా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల సాక్షిగా టీఆర్ఎస్ పతనం ఖాయమని రాజకీయ సన్యాసం తీసుకోటానికి కేటీఆర్ సిద్దం కావాలని చెప్పారు.

కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్ధుల‌ తొలి జాబితాలో సీటు ద‌క్క‌ని ఆశావాహులు టీఆర్ఎస్‌పై తిరుగుబావుటా జెండా ఎగుర‌వేస్తున్నారు. కొంత‌మంది టీఆర్ఎస్‌లో ఉండి ఆ పార్టీపై అస‌మ్మ‌తి గళాలు వినిపిస్తుండ‌గా.. మరికొంత‌మంది పార్టీ మారేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.
కేసీఆర్ ప్ర‌క‌టించిన తొలి జాబితాలో సీటు ద‌క్క‌ని కొండా సురేఖ దంపతులు టీఆర్ఎస్‌పై గ‌త కొంత‌కాలంగా విమ‌ర్శ‌న‌స్త్రాలు సంధిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్‌లో మీడియాలో మాట్లాడిన కొండా దంపతులు, అధిష్టానానికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. త‌మ‌కు టికెట్ ఏందుకు కేటాయించ‌డం లేదో చెప్పాల‌ని, ఆ త‌ర్వాత త‌మ దారి తాము చూసుకుంటామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌, కేటీఆర్‌పై దుమ్మెత్తి పోశారు. కేటీఆర్ త‌న చుట్టు ఒక కోట‌రీని నిర్మించుకున్నారని, కేటీఆర్ వ‌ల్లే త‌న‌కు టికెట్ రాలేద‌ని బాంబ్ పేల్చారు. తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుందని, త‌న‌కు టికెట్ కేటాయించ‌పోవడం తెలంగాణ మ‌హిళ‌లంద‌రికీ జ‌రిగిన అన్యాయం అని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

సమాధానం రాకపోగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టికెట్లు ఇవ్వమని కేటీఆర్ ప్రకటించిన నేపధ్యంలో మ‌రోసారి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన కొండా సురేఖ‌, కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాక‌పోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని కేటీఆర్ చెబుతున్న వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన ఆమె, టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, రాజ‌కీయ స‌న్యాసం పుచ్చుకోవ‌డానికి కేటీఆర్ సిద్దంగా ఉండాల‌ని సూచించారు.ఇక తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ అవినీతి మయం చేశార‌ని, కాంట్రాక్ట‌ర్ల‌కు దోచి పెట్టార‌ని నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ క్యాంపు ఆఫీసు, ఫాం హౌజ్ లకే పరిమితమైందన్నారు. అలాగే క‌విత‌ సైతం తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆమె నిప్పులు చెరిగారు. లష్కర్ బోనాల పండుగనాడు బంగారు బోనం ఎత్తుకోవడానికి కవిత కు ఉన్న అర్హత ఏమిటని నిలదీశారు. తెలంగాణా రాష్ట్రం అంటే కల్వకుంట్ల కుటుంబం కాదన్న సురేఖ కుటుంబ పాలనకు జనం చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

Facebook Comments