కొండా దంపతుల రివేంజ్ అదిరింది..? కేసీఆర్ కి ఊహించని షాక్..?

తమను అవమానించిన కేసీఆర్ కు దెబ్బ కొట్టాలని కొండా దంపతులు ప్రయత్నిస్తున్నారు. లేట్ గా పార్టీ మారినా కేసీఆర్ కు గట్టి షాక్ ఇస్తామని చెప్తున్నారు. టీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ లోకి తమతో పాటు కలిసి వచ్చే బలమైన నేతలకు గాలం వేస్తున్నారు. అంతే కాకుండా టికెట్ల విషయం లో కూడా రెండు స్థానాల టికెట్లు ఆశిస్తున్న కొండా దంపతులు సీట్ల సర్దుబాటు కోసం ప్రయత్నిస్తున్నారు. పరకాల, భూపాలపల్లి టికెట్లు తమకు కేటాయిస్తే రెండు స్థానాలతో పాటు మరో రెండు స్థానాలను గెలిపించుకుంటామంటూ మంతనాలు చేస్తున్నారు.

మాజీ మంత్రి, సీనియర్ నాయకురాలు కొండా సురేఖ కు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ షాక్ ఇచ్చారు. కేసీఆర్ బాటలోనే కొండా దంపతులు కూడా ఆయనకు షాక్ ఇవ్వనున్నారు. అందుకోసం తమ శ్రేణులతో, తమతో టచ్ లో వున్న సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. తమతోపాటు కాంగ్రెస్ లోకి వచ్చే వారితో మాట్లాడుతున్నారు. కేటీఆర్ కోసం తమకు కేసీఆర్ చేసిన అన్యాయంపై ఆగ్రహంతో ఉన్న కొండా దంపతులు రెండు టికెట్ల కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. భూపాలపల్లి టికెట్ కోరిన వారు కాంగ్రెస్ నుండి కూడా భూపాలపల్లి ఆశిస్తున్నారు. అలా అయితే భూపాలపల్లి నుండి గండ్ర రమణారెడ్డిని గానీ, సతీమణి గండ్ర జ్యోతిని గానీ వరంగల్ పశ్చిమ స్థానం నుండి పోటీ చెయ్యటానికి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే వరంగల్ వెస్ట్ లో వినయ్ భాస్కర్ కు చెక్ పెట్టే అవకాశం వుంది.

ఇక తమకు పట్టున్న పాకాల నుండి సురేఖ , భూపాలపల్లి నుండి మురళి స్వయంగా రంగంలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారు. నిన్నటి దాకా సిట్టింగ్ స్థానమైన వరంగల్ తూర్పు లో కూడా ఎవరూ ఊహించని విధంగా తమ అభ్యర్థిని నిలబెట్టాలనే యోచనలో ఉన్నారు. అందుకే కాస్త ఆలస్యం అయినా తాము అనుకున్నవన్నీ సర్దుబాటు చేసుకుని 4 స్థానాలు గెలిపించే హామీ తో సొంత గూటికి చేరబోతున్నారు కొండా దంపతులు. వినాయక చవితి తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో పార్టీ మారుతున్న కొండా దంపతులు ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు అంటూ కేసీఆర్ కు షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Facebook Comments