కేటీఆర్ దుమ్ముదులిపిన తెలుగు తమ్ముళ్ళు..! సాక్షాలతో సహా బట్టబయలు..

టీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్విట్టర్ ద్వారా నెటిజన్లకు అందుబాటులో ఉంటారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ట్విట్టర్ వేదికగా మహాకూటమిపై విమర్శలు సంధించారు కేటీఆర్ . ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్‌ చేసుకుని మహాకూటమిపై విమర్శల జల్లు కురిపించారు. ఒకనాడు కాంగ్రెస్‌ను విమర్శిస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్లనే రీట్వీట్ చేస్తూ మహాకూటమిపై చంద్రబాబుపై పరోక్ష దాడికి దిగారు.

అవినీతి కాంగ్రెస్ విముక్త భారతమే మన లక్ష్యం. అది సాధించడానికి ఏం చేయాలో అది చేద్దాం… మన నిస్వార్థ కూటమి గురించి చరిత్రే చెబుతుంది అంటూ 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘ఫేమస్ లాస్ట్ వర్డ్స్’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు కేటీఆర్ .అలాగే చంద్రబాబు గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం అంటూ రాహుల్, సోనియా గాంధీలు తెలంగాణపై కొత్తగా ఒలకబోస్తున్న ప్రేమ దుర్మార్గమైనది. తెలంగాణకు చివరిసారిగా వాళ్లు వచ్చింది ఎప్పుడు.. అభివృద్ధి కోసం వాళ్లు చేసిందేమిటి అని 2014 ఏప్రిల్ 26న చంద్రబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.

2014 వరకు స్కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా తెలంగాణ కోసం ఏమీ చేయకపోతే.. ఇంతలో వచ్చిన మార్పు ఏంటి? అంటూ టీడీపీ అధినేతను ప్రశ్నించారు కేటీఆర్. అన్ని జిల్లాల్లో ప్రజాగర్జన సభలు ముగిసే నాటికి కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతమవుతుంది. ఇటాలియన్ మాఫియా రాజ్‌కు ముగింపిది. ఇదే నా జోస్యం అంటూ 2014 ఫిబ్రవరి 15న చంద్రబాబు మరో ట్వీట్ చేశారు. బాబుని ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేసిన కేటీఆర్ పాత ట్వీట్లను రీ ట్వీట్ చేసే పనిలో పడ్డారు. నేను మహా కూటమిని మహా చెత్త కూటమి అంటున్నా అందుకే అంటూ కేటీఆర్ రెచ్చిపోయారు.
అయితే తెలుగు తమ్ముళ్లు దీనికి ధీటైన సమాధానమే ఇచ్చారు. తెలంగాలో టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు… మీరు నాడు తెలంగాణా ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో అక్లిపెస్తామని చెప్పలేదా… సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి ఆమెకు వంగి వంగి వందనాలు చెయ్యలేదా? 2004 లో కాంగ్రెస్ తో మీరు దేనికి పొత్తు పెట్టుకున్నారు? 2004 నుంచి 2009 మధ్యలో కాంగ్రెస్ కేంద్రంలో ఉండగా తెలంగాణా దేనికి సాధించలేకపోయారు? తెలంగాణ లో లేదు అని మీరు అంటున్న తెలుగుదేశం ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకు దేనికి? మీకు బిజెపి కి ఉన్న రహస్య ఒప్పందం ఏంటి ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు మీ కుటుంబం చెప్పినవన్నీ చేసినట్టు ఇప్పుడు పక్క పార్టీలను వేలెత్తి చూపిస్తున్నారా గురివింద తీరు లో మీరు చేస్తున్న ఈ ప్రచారం మీకే ఇబ్బంది గుర్తించండి అంటూ కేటీఆర్ ను ఉతికి ఆరేశారు.

Facebook Comments