టీటీడీపీ నుండి పోటీలో లెజెండరీ పొలిటీషియన్ ..ఎవరో తెలుసా

ఒకప్పుడు రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. టిడిపిలో సీనియర్‌ నాయకుడిగా,నీతి నిజాయితీలు ఉన్న వ్యక్తిగా గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గం లోపని చేసిన సమర్ధుడైన నేతగా ఆయనకు గుర్తింపు వుంది. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు పోటీ చెయ్యబోతున్నారు. కేసీఆర్ కు మిత్రుడైన ఆయన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా నిరాకరించారు. ఆయన తాను నమ్ముకున్న పార్టీ అయిన టీడీపీ నుండే ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఇంతకీ ఎవరా నేత అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం .

ప్రస్తుత రాజకీయాల్లో ఆయనంత నిరాడంబరుడు, నిస్వార్ధ పరుడు వుండరు . ఆ తరం నాయకుల్లో ఆయన ఒక లెజెండరీ పాలిటీషియన్. ఆయనే మండవ వెంకటేశ్వరరావు. నిదానపరుడు, ఆలోచనాపరుడు, నిజాయితీపరుడు, సమర్థుడైన మండవ ఇప్పుడు 2019 ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. టీడీపీ నుండి పోటీ చెయ్యబోతున్నారు.1989లో నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి నుంచి తొలిసారి గెలిచిన మండవ తరువాత 1994,1999లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. తరువాత 2004 ఎన్నికల్లో ఆయన తొలిసారి పరాజయంపాలయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆయనకు మరోసారి పరాజయం ఎదురైంది. అయితే 2009లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలోకి మళ్లీ అడుగుపెట్టారు.

అయితే తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో తాను ఇమడలేనని ఆయన స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల కాలంలో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పోటీకి తన దగ్గర ఆర్ధిక స్తోమత లేదని చెప్పినా చంద్రబాబు తాను చూసుకుంటానని చెప్పటంతో మండవ పోటీ చెయ్యటం ఖరారైంది. టీడీపీలో, అటు నిజామాబాద్ రూరల్ లో మండవకు మంచి పేరు వున్న నేపధ్యంలో ఆయన గెలుపు ఖాయమనే అందరూ అనుకుంటున్నారు.

Facebook Comments