మాణిక్యానికి లోకేష్ దిమ్మ‌తిరిగే స‌మాధానం!

అవును! ఇప్పుడు ఇదే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో అవినీతి జ‌రుగుతోంద‌ని, చంద్ర‌బాబు అండ్ టీం ప్ర‌జా ధ‌నాన్ని బొక్కేస్తోంద‌ని ఏవేవో ప్ర‌చారం చేస్తున్నారు బీజేపీ నాయ‌కులు. చంద్ర‌బాబుతో క‌లిసి ఉన్న స‌మ‌యంలో వారికి క‌నిపించ‌ని లోపాలు ఇప్పుడు భారీ ఎత్తున వారికి క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలో అవినీతి జ‌రిగిపోతోంద‌నిచెబుతున్నారు బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు. అయితే, కేంద్రం నుంచి వ‌చ్చిన ప‌రిశీల‌క బృందం మాత్రం.. ఏపీలో అంతా పార‌ద‌ర్శ‌కంగా జ‌రుగుతోంద‌ని, అంతా ఓకేనేన‌ని అంటున్నారు. మ‌రి కేంద్రానికి ఉలుకు.. నొప్పి రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఎందుకో? అనే ప్ర‌శ్న వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే..

అసెంబ్లీలో మాజీ మంత్రి, బీజేపీ నేత‌ పైడికొండల మాణిక్యాల రావు ఉపాధి హామీపై ప్రస్తావించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోకల్లా అత్యధికంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్రంలోని రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టర్, ప్రధాని మోడీ నిష్పక్షపాతంగా రాష్ట్రానికి ఏవిధంగా మేలు చేయచ్చో.. అలా మేలు చేయడా నికి ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా పలు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు. దీనికి లోకేష్ మాట్లాడుతూ.. బీజేపీకి చెందిన శాసనమండలి సభ్యులు అస్తమాను కేంద్రానికి లెటర్లు రాస్తున్నారు. అవినీతి జరిగిపోతోంది.. నీరు చెట్టుకు నిధులు డైవర్ట్ చేస్తున్నారని పదే పదే చెబుతున్నారని అన్నారు. అయితే, ఎక్కడా అవినీతి జరగట్లేదని,. కేంద్రంలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వమే మాకు క్లీన్ చిట్ ఇచ్చింద‌ని అన్నారు.

జ‌వాబుదారిత‌నం, పార‌ద‌ర్శ‌క‌త‌లో గడిచిన మూడేళ్లలో మూడు సార్లు ఏపీ మొదటి స్థానంలో ఉంది. బీజేపీ వాళ్లే కాదు.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్రానికి పదేపదే ఇలా లేఖలు వస్తుండటంతో సందేహించి చాలా ఆడిట్ టీమ్‌లను పంపింది. ఇప్పటికీ క్రిష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో నూటికి నూరుశాతం ఆడిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ఆడిట్ టీమ్ కూడా ఏపీలో ఎలాంటి అవకతవకలు జరగట్లేదని అని తేల్చిచెప్పేసింది. కేంద్ర మంత్రి తోమర్.. యంగ్‌ మినిస్టర్‌గా మంచి పనులు చేస్తున్నావని నన్ను మెచ్చుకున్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువగా నిధులు ఇస్తానని కూడా ప్రోత్సహించారు. ఇది ఆన్ రికార్డ్‌గా చెబుతున్నాను అని లోకేశ్ అసెంబ్లీలో అనడంతో ఇంకా ఏదో చెప్ప‌బోయిన మాణిక్యాల‌రావు సైలెంట్ అయిపోయారు. ఈ ప‌రిణామం చూసి మిగిలిన టీడీపీ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు.

Facebook Comments