తారక్‌కి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన లోకేశ్‌ …!

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. నందమూరి-నారా ఫ్యామిలీల మధ్య మంచి రిలేషన్స్‌ షురూ అయినట్లు కనిపిస్తోంది.. గత అయిదేళ్లుగా రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది.. చైతన్య రధ సారధి హరికృష్ణ మరణంతో అది కాస్త తగ్గినట్లు కనిపించింది… రీసెంట్ గా మరింతగా ఆ కుటుంబాల మధ్య సంబంధాలు మెరుగయినట్లు కనిపిస్తోంది.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్‌- యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ మధ్య సఖ్యత పెరుగుతున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జోరుగా సాగుతోంది.. తారక్‌ తండ్రి హరికృష్ణ అంతిమయాత్రలో నందమూరి-నారా కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా కనిపించాయి. హరికృష్ణ పాడెను చంద్రబాబు మోసి బావమరిదితో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.. తాజాగా లోకేశ్‌ టీమ్‌ తారక్ కి దసరా కానుక ఇచ్చినట్లు కనిపిస్తోంది..

హరికృష్ణ జీవించి ఉన్నప్పుడు నందమూరి-నారా కుటుంబాల మధ్య తెలియని గ్యాప్ ఉండేదనే ప్రచారం ఉంది.. టీడీపీకి తారక్‌ దూరం కావడం, పార్టీలో నందమూరి హరికృష్ణకు సముచిత స్థానం ఇవ్వకపోవడం వంటివి దీనికి సంకేతాలుగా చెబుతారు. అయితే, నల్లగొండ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ హఠాత్తుగా మరణించారు.. దీంతో, కల్యాణ్ రామ్ – తారక్‌ ఫ్యామిలీకి సైతం పెద్దదిక్కుగా మారిపోయారు చంద్రబాబు నాయుడు. ఈ బ్యాక్ డ్రాప్ లోనే యంగ్‌టైగర్‌కి బావ లోకేశ్‌ దసరా గిఫ్ట్‌ ఇచ్చాడనే రూమర్ పార్టీ వర్గాలలో విస్తృతంగా వినిపిస్తోంది..

తారక్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ ఈ వీకెండ్ కానుకగా రిలీజ్ కానుంది.. గురువారం వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది ఈ చిత్రం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న తొలి సినిమా ఇది.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే తారక్ తండ్రి హరికృష్ణ మరణించారు.. ఆ బాధను దిగమింగుకొనే సినిమా చేశాడు యంగ్ టైగర్.. విజయదశమి కానుకగా బాక్సాఫీస్ దగ్గరకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.. అందుకే, ఈ సినిమాకి ఏపీలో రోజుకు 6 ఆటలు ప్రదర్శించుకునేలా జీవో జారీ చేసింది ఏపీ సర్కార్.. సినిమా రిలీజ్ మరో మూడు రోజులు ఉండగానే లోకేశ్ దగ్గరుండి లైన్ క్లియర్ చేయించాడట.. ఈ సినిమా సక్సెస్ అయితే తారక్ మరింత పెరుగుతుంది.. ఈ మూవీతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నాడు తారక్. ఆడియోకి, ట్రయిలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇటు దసరా సీజన్ కూడా ఉండడంతో భారీ కలెకన్లు గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా అయితే ఒకటి రెండు రోజులకి మాత్రమే ఈ పర్మిషన్ లు ఇస్తారు. కానీ, తారక్ కి ఏకంగా వారం రోజుల పాటు డైలీ 6 షోలు వేసుకునే సౌలభ్యం కల్పించిందట ఏపీ సర్కార్.. నందమూరి ఫ్యాన్స్ లో ప్రస్తుతం ఈ వార్త ఫుల్ జోష్ లో వినిపిస్తోంది.. 2019 ఎన్నికలలో తారక్‌ని స్టార్‌ క్యాంపెయినర్‌గా దించే చాన్స్‌లున్నాయి.. ఇది కూడా తారక్‌తో రిలేషన్స్‌ మెయింటెన్‌ చేయాలని భావిస్తుండడానికి మరో రీజన్‌ అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.. మొత్తమ్మీద, బావమరిది యంగ్‌టైగర్‌కి బావ లోకేశ్‌ దసరా కానుక అదిరిపోయిందన్నమాట….?? మరి రిటర్న్‌ గిఫ్ట్‌ సంగతేంటనేదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌….!!!!

Facebook Comments