2019 టార్గెట్‌ దిశగా లోకేష్‌ పరుగులు….!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఆయన రాజకీయ వారసుడు లోకేష్‌ టార్గెట్‌ 2019 దిశగా వడివడిగా పరుగులు పెడుతున్నారు. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్‌ పలు విజయాలు సాధించారు.. ఇటు గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రిగా సక్సెస్‌ అయ్యారు. జాతీయంగా అనేక పతకాలు దక్కించుకున్నారు.

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా అనేక విజయాలు సాధించినా, ఆయన ఐటీ శాఖ మంత్రిగా భారీ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. 2019లోపు ఏపీలో ఐటీలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని ఆయనకు ఆయనే ఓ టార్గెట్‌ పెట్టుకున్నారు. ఉమ్మడి ఏపీని ఐటీకి కేరాఫ్‌గా చేసి, సైబరాబాద్‌ని ఇండియా సిలికాన్‌ వ్యాలీగా మార్చారు చంద్రబాబు.. విభజిత ఏపీలోనూ ఈ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని కలలు కన్నారు లోకేష్‌. ఐటీలో తనకంటూ దేశంలోనే ఓ సొంత లక్ష్యం పెట్టుకున్నారు లోకేష్‌. ఐటీకి అప్పటికే హైదరాబాద్‌ అడ్డాగా మారడంతో లోకేష్‌కి ఇది సవాల్‌గా మారింది. దీంతో, ఐటీ కంపెనీలకు పలు ఆఫర్‌లు, భారీ రాయితీలు ఇచ్చి అనేక కంపెనీలను ఏపీ దిశగా పరుగులు పెట్టించారు లోకేష్‌. విదేశాలలోనూ తిరిగి పదుల సంఖ్యలో కంపెనీలు ఏపీలో అడుగుపెట్టేలా చేశారు.

ఓవైపు, ఏపీ ఫైనాన్షియల్‌ కేపిటల్‌ అయిన విశాఖను బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీకి ఏపీని సెంటర్‌గా మార్చడంలో విజయం సాధించారు లోకేష్‌. తాజాగా విజయవాడలో ఫార్చూన్‌ 500 కంపెనీలలో ఒకటయిన హెచ్‌సీఎల్‌ని విజయవాడకి రప్పించారు లోకేష్‌. హెచ్‌సీఎల్‌కి ఏపీ 18 ఎకరాలు కేటాయించింది.. ఎకరానికి వెయ్యి మంది ఎంప్లాయిస్‌కి జాబ్‌ కేటాయించాలనే టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అమరావతిలో స్టార్ట్‌ చేసిన హెచ్‌సీఎల్‌తో ఏపీలో సాఫ్ట్‌ వేర్‌లో 39వేల మంది వర్క్‌ చేస్తున్నారు.. వచ్చే ఏడాది ఎండింగ్‌కి మరో 60 వేల మందికి జాబ్‌లు కల్పించాలనేది ఏపీ లక్ష్యం.. ఇదే స్పీడ్‌తో చూస్తే లోకేష్‌ ఆ టార్గెట్‌ని ఈజీగా రీచ్‌ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు..

Facebook Comments