లోకేష్ టీంలోకి స్టార్ బ్యాట్స్ మ్యాన్..ఎంపీగా పోటీ..

ఆ యువనేత ఒక స్టార్ బ్యాట్స్ మాన్, ఆటల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆ యువనేత గత ఎన్నికల్లోనే పోటీలో ఉంటారని భావిస్తే అప్పుడు సాధ్యం కాలేదు. అయినాసరే ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న ఆ యువనేత ఇప్పుడు లోకేష్ టీం లో జాయిన్ కాబోతున్నాడు. ఇంతకీ ఎవరా యువనేత స్టార్ బ్యాట్స్ మాన్ అంటే ఇంకెవరు పరిటాల శ్రీరామ్ అని అనంతపురం వాసులు ఠక్కున చెప్పేస్తారు.

చంద్రబాబు వారసుడిగా రాజకీయ తెరంగేట్రం చేసిన నారా లోకేష్ తన టీం ను తయారు చేసుకునే పనిలో పడ్డారు. యువ నాయకులకు రాజకీయాల్లో అవకాశం ఇస్తే ఇప్పటి సమాజ అవసరాలకు తగ్గట్టు పని చేస్తారని భావిస్తున్నారు. గత సంవత్సరం ఎమ్మెల్సీ గా అటు నుంచి అటు మంత్రి గా లోకేష్ పెట్టుబడులు ఆకర్షించడంలో తండ్రికి తగ్గ తనయుడు గా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ పరంగా లోకేష్ కి మరింత సమయం ఉన్నా, చంద్రబాబు చాలా జాగ్రత్తగా లోకేష్ టీం ని రెడీ చేస్తున్నారు అనేది బహిరంగ రహస్యమే. రాబోయే తరం నాయకుల్లో బలమైన నాయకులని ఎంచి మరి లోకేష్ కి అండగా ఒక టీం ను తయారు చేస్తున్నారు. తాజాగా అనంత రాజకీయాల్లో పరిటాల రవి కుటుంబం నుండి వచ్చిన యువనేత పరిటాల శ్రీరామ్ లోకేష్ టీమ్ లో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాజకీయాలలో శ్రీ రామ్ పోటీ చేయ్యనున్నారన్న సంచలన వార్త వినిపిస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతం ఎంపీగా ఉన్న నిమ్మల కిష్టప్ప ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తుండటంతో ఖాళీ అవుతున్న హిందూపురం పార్లమెంటు స్థానానికి యువనేత పరిటాల శ్రీ రామ్ దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు కూడా ఆ యువనేతని అభ్యర్థిత్వానికి ఓకే చెప్పారని తెలుస్తుంది.

తన తండ్రి నుంచి వచ్చిన అభిమానుల బలం, వ్యక్తిగత సామర్ధ్యం వెరసి పరిటాల శ్రీ రామ్ పట్ల యువత లో బాగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ యువ నేత తండ్రి తల్లి బాటలోనే రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు యువ ఎంపీగా పార్లమెంట్ లో తన గళాన్ని వినిపిస్తున్నాడు. అలాగే ఇప్పుడు అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించి హిందూపురం పార్లమెంట్ స్థానం పరిటాల శ్రీ రామ్ కు టికెట్ కేటాయిస్తే ఈ యువనేత కూడా పార్లమెంట్ లో ఏపీ ప్రజా వాణి వినిపించే అవకాశం వుంది. ఈ స్టార్ బ్యాట్స్మన్ పరిటాల శ్రీ రామ్ ప్రస్తుతం హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉండటంతో పరిటాల అభిమానులు మంచి జోష్ లో ఉన్నారు.

Facebook Comments