లోకేష్ పై బ్రాహ్మణి సర్వే… షాకింగ్ రిజల్ట్

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మీద తాజాగా చేసిన ఒక సర్వే ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఆ సర్వే చేసింది ఎవరో కాదు సాక్షాత్తు లోకేష్ భార్య చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి . చంద్రబాబు తో పాటు లోకేష్ కూడా ఏపీని అభివృద్ధి చేయడానికి చాల కష్టపడుతున్నారు. ఒక ప్రక్క రాష్ట్రంలో విదేశీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించి ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి శత విధాలా శ్రమిస్తున్నారు. మరో ప్రక్క మిగిలిన నిరుద్యోగ యువతకి ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి క్రింద ప్రతి నెల 1000 రూపాయలు అందచేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా లో పర్యటించి అక్కడి కంపెనీలను ఒప్పించి ఏపీ కి తీసుకురాబోతున్నారు లోకేష్.

ఇంతగా కష్టపడుతున్న లోకేష్ పై ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు. ఆయన పని తీరుకు వాళ్ళు ఎన్ని మార్కులిస్తున్నారు. ఒక పక్క జగన్, పవన్ లు , బీజేపీ నాయకులు లోకేష్ ను టార్గెట్ చేసి ఆయనపై నెగిటివ్ ప్రచారం చెయ్యాలని చూస్తున్న తరుణంలో ప్రజల గుండెల్లో లోకేష్ స్థానం ఏంటి తెలుసుకోవాలని బ్రాహ్మణి సర్వే చేయించారు. ఆ సర్వే విషయం తెలిసిన లోకేష్ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ సర్వే ప్రకారం, తండ్రికి తగ్గ కొడుకుగా లోకేష్ చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పలు అభివృద్ధిపనులలో పాల్గొంటూ అదేవిధంగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలు వారు పడే కష్టాలను తెలుసుకుంటున్నారని ఈ సర్వే తెలియచేస్తుంది. లోకేష్ పాలనపై జనం చాలా తృప్తి చెందారని సమాచారం. అదే విధంగా ఈ సారి ఎలక్షన్స్ లో లోకేష్ ఎక్కడ నుండి పోటీచేసినా గెలుస్తాడని ఈ సర్వే చెపుతుందంట. ఈ సర్వేపై చంద్రబాబు కూడా చాలా సంతోషంగా ఉన్నారట .తన భర్త పాలన ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దశ్యంతో బ్రాహ్మణి చేయించిన సర్వే రిపోర్ట్ చూసి బ్రాహ్మణి కూడా చాలా సంతోషంగా ఉన్నారట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Facebook Comments