మహాకూటమి దెబ్బకు ప్లాన్ మార్చిన కేసీఆర్ ..

మహాకూటమి దెబ్బకు కేసీఆర్ కు దిమ్మ తిరుగుతుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా మళ్ళీ పాలనా పగ్గాలు చేపడతామనుకున్న కేసీఆర్ కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు స్నేహ హస్తం అందుకున్న కాంగ్రెస్ తెలంగాణా జనసమితి,సీపీఐ లతో కలిసి మహా కూటమిగా ఏర్పడి పోరుకు సిద్ధం అయ్యాయి. తాజా సర్వేల్లో బీజేపీ కంటే మహాకూటమితోనే టీఆర్ఎస్ పార్టీకి ముప్పు ఉందని వస్తున్న నేపధ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్.

తెలంగాణాలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు… అసలు ఎవరూ ఊహించని కేసీఆర్ వ్యూహం ఇది . థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు పార్టీలు కూడా లేవు కానీ కేసీఆర్ అవసరం అనుకుంటే వాటిని సృష్టించగలడు కూడా. అందులో భాగంగానే థర్డ్ ఫ్రంట్ ను కుల సంఘాలతో ఏర్పాటు చెయ్యటానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ వ్యతిరేఖ ఓటు బ్యాంకు మహాకూటమికి పోల్ కాకుండా కుల సంఘాల పేరుతో ఏర్పాటయ్యే థర్డ్ ఫ్రంట్ చీలుస్తుంది. అప్పుడు తిరిగి కేసీఆర్ కే విజయం సాధ్యం అవుతుంది అన్న పక్కా స్కెచ్ తో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చెయ్యబోతున్నారు కేసీఆర్ .
షెడ్యూల్ కులాలు, వెనకబడిన కులాలు, గిరిజన తెగలు, మైనారిటీ కమ్యూనిటీలతో కూడిన సామాజిక, కుల సంఘాలతో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఫ్రంట్ టీఆర్ఎస్ తో కలిసి పనిచేయదు. కానీ, టీఆర్ఎస్ కు అనుకూల ఫలితాలు వచ్చే విధంగా అది వ్యవహరించే అవకాశం ఉంది. టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి అది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే కేసిఆర్ తో పాటు , మంత్రి హరీష్ రావు బీసీ నేత ఆర్. కృష్ణయ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, బహుజన వామపక్ష కూటమి నేత తమ్మినేని వీరభద్రం, ప్రజా గాయకుడు గద్దర్ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా తృతీయ ప్రత్యామ్నాయం ప్రకటించనుంది.

మహా కూటమికీ టీఆర్ఎస్ కు మధ్య ముఖాముఖి పోటీ ఉంటుందని సర్వేలో తేలడంతో మూడో ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి పెట్టిన కేసిఆర్ కుల సంఘాలను రంగంలోకి దించి దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంది. ముూడో ఫ్రంట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కొంత మందికి మంత్రి పదవులు ఇవ్వడానికి, ఆ ఫ్రంట్ కు చెందిన కొంత మంది నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం వంటి వాటిని ఎరగా వేసి కేసీఆర్ మళ్ళీ పాలనా పగ్గాలు చేజిక్కించుకోవాలని చూస్తున్నారు.

Facebook Comments