మహాకూటమి సీఎం అభ్యర్థి… రేవంత్ రెడ్డి ?

తెలంగాణ రాజకీయాలలో కెసిఆర్ తో పెట్టుకునే దమ్మున్నోడు రేవంత్ రెడ్డి మాత్రమే… ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే కేసీఆర్ కు దీటుగా సమాధానం చెప్పగల వాడు, తొడగొట్టి మరీ సవాల్ చెయ్యగల ధైర్యం ఉన్నోడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ , రేవంత్ రెడ్డి ల మధ్య మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది.2014 ఎలక్షన్స్ లో గెలుపొందిన టీడీపీఎమ్మెల్యేలను భయపెట్టి టిఆర్ఎస్ లో చేరేటట్టు చేసాడు కెసిఆర్. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరి దొరకు సలాం చేశారు. అయితే ఏం చేసినా సరే పార్టీ మారనన్న ధీరుడు,కేసీఆర్ పక్కాగా ప్లాన్ చేసిన ఓటుకు నోటు కేసులో ఇరికించినా నీ చేతనైంది చేసుకో అన్న రేవంత్ రెడ్డి మాట తీరు, ధైర్యం కేసీఆర్ కు అసలే నచ్చదు. అందుకే ఓటుకు నోటుతో కెసిఆర్ రాజకీయంగా రేవంత్ పై పెద్ద దుమారమే రేపి రేవంత్ ని జైలుకి కూడా పంపించాడు

తెలంగాణలో జరుగుతున్నా రాజకీయ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. పార్టీ మారినా తాను అంతకాలం ఉన్న టీడీపీ పై ఎప్పుడూ నోరు జారలేదు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కూడా చురుకుగా ఉంటూ బలమైన నేతగా ఎదిగాడు. కాంగ్రెస్ లో బలమైన నాయకులూ ఉన్న, రేవంత్ పేరు వస్తే చాలు ఇటు ఆయన అభిమానులు అటు ఓటర్లు ఉత్సాహంతో ముందుకు వస్తారు. అయితే ఒక రేవంత్ రెడ్డి కె నాయకులందరినీ ఒక తాటిమీదకి తెచ్చే సామర్థ్యం ఉందని, కెసిఆర్ ను కూడా దీటుగా ఎదుర్కునే నాయకుడు ఆయనేనని అంటున్నారు రాజకీయ వర్గాలు.

అందుకు కారణం కూడా లేక పోలేదు తాజాగా కూడా ఐటీ దాడుల నేపధ్య రేవంత్ చూపించిన ధైర్యం కేసీఆర్ ను రేవంత్ ఎదుర్కొన్న తీరు ను కూడా అటు పార్టీ శ్రేణులు ఇటు ప్రజలు గమనించారు. 2019 ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయవర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి ని కాకా వేరే ఎవరినైనా ప్రకటిస్తే టిఆర్ఎస్ విజయం ఖాయమని అంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ మహాకూటమిగా పోటీచేస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అయితే ఇరు పార్టీల నేతలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా అవకాశం ఇస్తే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చే అవకాశం వుంటుంది.

Facebook Comments