మహాటీవీ మూర్తిని అందుకే వదిలించుకుందట

మూర్తి సారధ్యంలో నడుస్తున్న మహాటీవీలో మలుపు మూర్తి సీటుకే ఎసరు పెట్టింది. ప్రస్తుతం మూర్తి మహాటీవీ నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. మూర్తి వచ్చాక మహాటీవీలో చాలా మార్పు వచ్చింది. మహాటీవీ చాలా సందర్భాల్లో పోటీ చానళ్లతో పోటీ పడింది.అయితే జనసేన వ్యవహారం ఒకటి వెలుగులోకి తెచ్చిన మూర్తి కి ఆ ఇష్యూ తో యాజమాన్యం నుండి వత్తిడి ఎదురైంది. అందుకే మూర్తి మహాటీవీ వదిలిపోవాల్సి వచ్చింది.

కొత్త యాజ‌మాన్యంతో కొన్ని రోజులుగా కళకళలాడిన మ‌హాటీవీ ఆ చానల్ అంటే అందరికీ తెలిసేలా చేసిన మూర్తిని వ‌దిలించుకుంది. దీనికి రాజకీయ కారణం వుంది. జనసేన ఒక సామాజిక వర్గం తో ఒక రహస్య స‌మావేశం నిర్వ‌హిస్తే దానిలో ఎంట్రీకి పది లక్షలు కట్టాలని, స్ట్రింగ్ ఆప‌రేష‌న్ అంటూ మూర్తి చేసిన హ‌డావిడి రాజకీయంగా సంచలనం అయ్యింది.అది జ‌న‌సేన‌కు భారీగా న‌ష్టం కలిగించింది. ఇప్పుడు అదే మూర్తి బ‌య‌ట‌కు రావాల్సిన ప‌రిస్థితిని తీసుకొచ్చింది. దాంతో ఈ వ్య‌వ‌హారం మ‌హాటీవీలో క‌ల‌క‌లంగా మారింది .

ఐ వెంక‌ట్రావు సార‌ద్యంలో వ‌చ్చిన ఈ చానెల్ కు సుజ‌నాచౌద‌రి బాధ్యత తీసుకున్నాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.కొంతకాలం అదే చానెల్ లో విలేక‌రిగా ప‌నిచేసిన మారెళ్ల వంశీ ఎండీగాబాధ్య‌తలు నిర్వర్తించారు . ఏబీఎన్ నుంచి మూర్తి వ‌చ్చి చేర‌డంతో మ‌హామూర్తి పెద్ద‌స్థాయిలో హ‌ల్ చ‌ల్ చేశారు. అయితే తొలి నుంచి వంశి కి మూర్తి కి విబేధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.మూర్తి కొంచెం ముక్కు సూటిగా వెళ్లే తత్వం, చర్చల్లో సూటిగా ప్రశ్నించే విధానం అందరికీ బాగా నచ్చాయి.. శ్రీరెడ్డి వ్య‌వ‌హారం నుంచి చివ‌ర‌కు జ‌నసేన‌లో దందా అంటూ వ‌చ్చిన క‌థ‌నాలు దుమారం రేపాయి. జనసేన భారీ వసూళ్లు అంటూ మూర్తి స్టింగ్ ఆపరేషన్ తో నిర్వాహకుల మ‌ధ్య విబేధాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. అదే ఇప్పుడు మూర్తి మ‌హా న్యూస్ వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితికి దారితీసింది. జనసేన లోని ప్రముఖుల నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగానే కార్యక్రమాన్ని మధ్యలో ఆపేసినట్టు, మరిన్ని కీలక ఆధారాలు తొక్కిపెట్టినట్టు తెలుస్తుంది. జనసేన ఇష్యూ వల్ల మొత్తానికి మహా న్యూస్ లో మూర్తి అంకం ముగిసింది.

Facebook Comments