మనుషుల్ని దింపి మర్డర్ చేయిస్తారట..! మైలవరం”వసంత” బెదిరింపుల పర్వం..!!

మొన్న వైఎస్ వర్థంతికి.. లక్ష చీరలు పంచి.. వందల కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తానని.. విర్రవీగిన… వసంత కృష్ణ ప్రసాద్ అనే… పెద్ద మనిషి… ఇప్పుడు… మర్డర్లు చేయిస్తానని బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఒక్కో గ్రామాన్ని లక్ష్యంగా ఎంచుకుని… ప్లాన్ అమలు చేస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు… వసంత ప్రాజెక్ట్స్ పేరుతో భూములు తీసుకుని అడ్డంగా సంపాదించిన సొమ్ముతో.. ఆర్థికంగా బలవడమే కాకుండా.. ఇప్పుడు రాజకీయంగా ఆ బలుపు చూపేందుకు వెనుకాడటం లేదు. మంత్రి ఉమని ఓడించడానికి సహకరించాలంటూ… ఓ ప్రభుత్వ ఉద్యోగిని.. వసంత కృష్ణప్రసాద్ తండ్రి.. వసంత నాగేశ్వరరావు బెదిరించిన ఆడియో టేపు ఇప్పుడు వైరల్ అయిపోయింది.

దేవినేని ఉమను ఓడించడానికి జగన్ అవసరమైతే కడప నుంచి మనుషుల్ని దించుతాడంటూ.. వసంత నాగేశ్వరరావును హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఈ కడప మనుషుల్ని ఎందుకు దింపుతారంటే… ఓ గ్రామంలో ఫ్లెక్సీలు పట్టనీయలేదట. టీడీపీకి పట్టున్న గ్రామాలైన ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడిల్లో వైసీపీ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. గుంటుపల్లిలో భారీగా ఫ్లెక్సీలు పెట్టింది. ప్రజలకు ఇబ్బందిగా ఉందనేకారణంగా పంచాయతీ సిబ్బంది రెండు పార్టీల ఫ్లెక్సీలను తొలగించారు. టీడీపీ నేతలు సైలెంట్‌గానే ఉన్నారు. కానీ వసంత నాగేశ్వరరావు మాత్రం కొడుకు కోసం రంగంలోకి దిగారు. ఈ నెల 7 రాత్రి గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్‌.వి.నరసింహారావుకు ఫోన్‌చేసి మర్డరైపోతావని నేరుగా హెచ్చరించేశారు.

దీంతో ఆ పంచాయతీ కార్యదర్శి భయపడిపోయారు. రాజకీయాలకు తనకేం సంబంధం అని.. ఏ పార్టీ ఫ్లెక్సీలు కట్టినా తీసేశానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు వసంత నాగేశ్వరరావుపై ఆదివారం కేసు నమోదు చేశారు. ఇంకా పూర్తిగా ఎన్నికల వేడి పెరగక ముందే.. గతంలో హోంమంత్రిగా పని చేసిన వ్యక్తే.. మర్డర్లు చేస్తాం.. కడప నుంచి మనుషుల్ని దింపుతామని హెచ్చరించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పొరపాటున వాళ్లు అధికారంలోకి వస్తే… లా అండ్ ఆర్డర్ అంటే.. కడప మనుషులు చేసేదే అన్నట్లు మారిపోయే పరిస్థితి ఉంది.

Facebook Comments