మరో సంచలనం టీడీపీ ఎంపీ పై ఈడీ దాడులు

కేంద్రం కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దాడులకు పాల్పడే అవకాశం వుంది అని ఆపరేషన్ గరుడ లో భాగం ఇది అని మొదట నుండి అందరూ చెప్పుకుంటున్న విషయమే . ఎన్డీయే నుంచి ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ బ‌య‌ట‌కొచ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై, బీజేపీ ప‌న్నుతున్న కుట్ర‌లు అన్నీఇన్నీ కావు. కేంద్ర మంత్రుల, ఎంపీల ఇళ్ళపై కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేస్తున్న ఐటీ, ఈడీలు అసలు ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పకుండా గాలింపు చేస్తున్నారు. బాబు ని ఏదో ఒక పెద్ద కేసులో ఇరికించే ఆధారాలకోసం ఇలా కుట్ర చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

ఏపీలో టీడీపీ నేత‌ల‌పై ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్న నేప‌థ్యంలో.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీ సుజ‌నా చౌద‌రి కార్యాల‌యాల‌పై ఈడీ దాడులు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. సుజ‌నా చౌద‌రికి చెందిన వ్యాపారాల‌పై ఈడీ దాడులు నిర్వ‌హించింది. ఈ సోదాల్లో 120 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దాంతో పాటు ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఐటీవ‌లే టీడీపీ నేత‌ల‌పై ఐటీ దాడులు సంచ‌ల‌నం రేపుతున్న క్ర‌మంలో.. ఇప్పుడు సుజ‌నా చౌద‌రి వ్యాపారాల‌పై ఈడీ దాడులు నిర్వ‌హించ‌డం ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

ఏదో ఒక విధంగా చంద్ర‌బాబును జైలుకు పంపించి ఏపీలో అధికారాన్ని త‌మ చేతుల్లోకి తీసుకునేందుకు మోదీ అండ్ అమిత్‌షా కుట్రలు పన్నుతున్నారు. ఇటీవ‌లే చంద్ర‌బాబుపై బాబ్లీ కేసును తెర‌పైకి తీసుకొచ్చినఇబ్బంది పెట్టాలని చూసారు. తరువాత ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబును మ‌రోసారి ఇరికించేందుకు ప్రయత్నించారు. ఇక పార్టీ మంత్రులపై, పార్టీ నేత‌ల‌పై ఐటీ, ఈడీ అధికారుల‌తో దాడులు చేయించి నైతికంగా, మాన‌సికంగా దెబ్బ‌కొట్టే ప్ర‌య‌త్నాలుచేస్తున్నారు. ఇదంతా కేవలం అధికారం కోసమే … బాబు బీజేపీ పై థర్డ్ ఫ్రంట్ లో యుద్ధం చెయ్యకుండా ఉండాలనే దురుద్దేశమే .ప్ర‌ధానంగా టీడీపీ నేత‌లే ల‌క్ష్యంగా ఐటీ అధికారులు దాడులకు పాల్ప‌డంతో.. కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌లో భాగంగానే ఈ దాడులు జ‌రిగాయ‌నేది స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతోంది. ఇప్పుడు సుజనా చౌదరి వంతు వచ్చింది. నెక్స్ట్ ఎవరో అని టీడీపీ నాయకులు టెన్షన్ పడుతున్నారు. కేంద్రం తీరుపై మంది పడుతున్నారు. ఇలా మైండ్ గేమ్ ఆడుతున్న బీజేపీని త్వరలో గద్దె దింపుతామని చెప్తున్నారు.

Facebook Comments