ఎంజె అక్బర్.. అప్పుడు జర్నలిస్టు..! ఇప్పుడు బీజేపీ మంత్రి..! కానీ ఎప్పుడూ కీచకుడే..!

కేంద్ర మంత్రి విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పాత్రికేయుడు ఎంజే అక్బర్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మీ టూ ఉద్యమం పేరుతో… అనేక మంది ప్రముఖులుగా చెలామణి అవుతున్న కీచకుల వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈయన గతంలో ది టెలిగ్రాఫ్, సన్‌డే, ది సండే గార్డియన్, ఏషియన్‌ ఏజ్, దక్కన్‌ క్రానికల్‌ పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో మహిళా జర్నలిస్టులను.. లైంగికంగా వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్బర్ తమను కోర్కె తీర్చాలని బలవంతం చేశారంటూ.. ప్రియా రమణి, ప్రియా రమణి, ప్రేరణాసింగ్‌ బింద్రా, పేరు బయటపెట్టని మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేశారు.

ఫస్ట్‌పోస్ట్‌ అనే వెబ్‌పోర్టల్‌లో రమణి, పేరు తెలియని రచయిత అక్బర్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. ప్రియారమణి నేరుగా ట్వీట్ చేశారు. 2017లో వోగ్‌ మేగజీన్‌కు రాసిన ఓ వ్యాసం రాశారు. అప్పుడు బీజేపీ అధికారానికి భయపడి పేరు రాయలేదు. అక్బర్‌ ఆమెను ఒక ఇంటర్వ్యూ నిమిత్తం ముంబైలోని ఒక హోటల్‌కు ఆహ్వానించి, గదిలోకి పిలిచి తాగడానికి ఒక డ్రింక్‌ ఇచ్చాడని వెల్లడించింది. అంతటితో ఆగకుండా చాలా దగ్గరగా కూర్చొమన్నాడని ఆమె తెలిపింది. ఎలాగో అలా ఆ రాత్రి అక్బర్‌ నుంచి తప్పించుకున్నానని వ్యాసంలో రాశారు. కానీ ఇప్పుడు మీ టూ ఉద్యమం ధైర్యంతో నేరుగా ప్రకటించారు. రాత్రి ఎడిషన్‌ ముగిశాక పని గురించి చర్చించడానికి అక్బర్‌ హోటల్‌ గదికి పిలిచారని బింద్రా తెలిపారు. హోటల్‌ గదిలో కలవాలని ఆ బృందంలోని వారిని కూడా కోరినట్లు సహచరిణి ఒకరు చెప్పారని బింద్రా ప్రకటించారు.

కేంద్రమంత్రిపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. మహిళా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కు డిప్యూటీగా ఆయన పని చేస్తున్నారు. ఈ ఆరోపణల మీద విచారణ నిర్వహిస్తారా?’ అని మహిళా జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలకు సుష్మ సమాధానం చెప్పలేకపోతున్నారు. మోడీ ఏమంటాడో నన్న భయమే కారణం. రమణి చేసిన ఆరోపణలకు అనేక మంది స్పందించారు. వారి బాధలను కూడా బయటపెట్టారు. కానీ .. అక్బర్ ను నెత్తిన పెట్టుకున్న మోడీ స్పందించడం లేదు. కేంద్ర మంత్రి కీచకానికి సంబంధించించిన మరిన్ని విశేషాలు త్వరలో బయటకు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

Facebook Comments