కాంగ్రెస్‌కు షాక్: ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజీనామా

కాంగ్రెస్‌కు మాజీ స్పీకర్, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ రాజీనామా చేశారు.

కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నాదెండ్ల పార్టీనీ వీడే అంశంపై అనుచరులతో చర్చించారు. చివరికి జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేడు తిరుపతిలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. దీంతో జనసేన తరపున తెనాలి నుంచి మనోహర్ పోటీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.

నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే.

Facebook Comments