నాలుగేళ్ల నారావారి పాలన …. చూస్తే శభాష్ అంటారు…ఇదిగో లెక్క చూసుకోండి !

కేంద్రం నమ్మించి మోసం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా గొంతు కోసింది. అయినా ఆయన పట్టిన పట్టు వీడలేదు. రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ముందుకు నడిచారు.
ముళ్ళ బాటలో తానూ నడుస్తూ ప్రజలకు పూల బాట వెయ్యటానికి ప్రయత్నించారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన పాలనా నైపుణ్యాన్ని అంతా ఉపయోగించారు. 1500రోజుల పాలనను సమర్ధవంతంగా, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ముందుకే సాగారు. ప్రతిపక్షాల విమర్శలను తట్టుకుని వారి చేతే చాలా సందర్భాల్లో శభాష్ అనిపించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. నాలుగేళ్ళుగా 1500 రోజుల పాలనలో అలుపెరుగని పోరాటం చేసిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం , ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారంటే

86,69,000 డ్వాక్రా మహిళలకి 51,745 కోట్ల రూపాయల రుణాన్ని అందించి ఆడపడుచులకు అండగా నిలిచారు.16,985 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించి గ్రామాలను అద్దాల్లా మార్చారు. దీనికోసం 4344 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. ప్రతీ రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి అన్న ఆలోచనతో 24,500 కోట్ల రూపాయల రుణ మాఫీ చేశారు.ఎన్టీఆర్ భరోసా పధకంతో యాబై లక్షల ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను అందించారు.గత నాలుగు ఏళ్లలో అర్హులైన 14,45,656 మందికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేశారు.అర్బన్ హౌసింగ్ స్కీమ్ ఆధారంగా 7.38 లక్షల ఇళ్లను పేద ప్రజలకు కట్టించారు.ప్రజల జీవితాల్లో వెలుగులు చూడటం కోసం, ప్రజలు సంతోషంతో జీవించడమే లక్ష్యంగా 1,02,726 కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్ట్స్ ను చేపట్టారు. అన్న క్యాంటీన్స్ ద్వారా పేదవాడికి అన్నం పెడుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకోసం విశేషంగా కృషి చేశారు. నీరు, రోడ్లు, నిర్మాణాలు, ఎల్యీడీ లైట్లు ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు.

4,172 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఇప్పటికే పూర్తి అయ్యాయి, 57,160 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా 4,072 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు వచ్చే రెండు ఏళ్లలో 37,323 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.ఇలా ఎన్నో సంక్షేమ, ప్రజోపయోగ పథకాలతో సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందం.. ఇదే సంకల్పంతో సాగుదాం.. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం అంటూ ప్రగతి పధాన ముందుకు నడుస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

Facebook Comments