కౌశల్ పై సెటైర్లు వేసిన నందు…నందు అంత ఎమోషనల్ అయ్యింది అందుకేనా…?

బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే కి సమయం దగ్గర పడుతున్న సమయంలో షో లో ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హౌస్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా ఫ్రీజ్,రిలీజ్ అంటూ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ ల ఎమోషన్స్ ను చెక్ చేస్తున్నారు బిగ్ బాస్. అందులో భాగంగా కుటుంబ సభ్యులను హౌస్లోకి పంపిస్తున్నారు. అందరూ వెళ్లి తమ వారిని కలిసి ఎమోషన్ కు గురవుతున్నారు. అయితే గీతామాధురి భర్త నందు కన్ఫెషన్ రూమ్ నుండి ముందు మాట్లాడినప్పుడే బుజ్జి నువ్ నా పిల్లవి అంటూ చెప్పటం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది.

గీతామాధురి కోసం తన భర్త నందు హౌస్ లోకి వెళ్లగా.. అతడిని చూసి గీత కంటే నందు నే ఎక్కువ ఎమోషనల్ అయ్యాడు . ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఏడ్చేశారు. ఇంకెప్పుడూ ఇలా దూరంగా ఉండకని గీతాతో అన్నాడు నందు. బయట జనాలు ఏం అనుకున్నా.. నాకు నీ మీద చాలా ప్రేమ, నమ్మకం ఉందని ఆమెకు భరోసా ఇచ్చాడు నందు . నందు పరోక్షంగా సామ్రాట్, గీతాల గురించి బయట జరుగుతోన్న చర్చ గురించి మాట్లాడాడు. గీతాతో మాట్లాడుతూనే కౌశల్ కి సెటర్లు వేశాడు నందు. ఏం పని చేయాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలిగా లేదంటే రూల్స్ బ్రేక్ చేశానని నన్ను నామినేట్ చేస్తారా..? అంటూ కౌశల్ పై జోక్స్ చేశాడు.

ఇంట్లో ఏదైనా వస్తువుని ముట్టుకున్నా.. కౌశల్ నేను ఇలా చేయొచ్చా.. అంటూ అతడి పర్మిషన్ తీసుకుంటూ ఫన్ క్రియేట్ చేశాడు నందు.కౌశల్ విషయం లో అలాగే సామ్రాట్ విషయంలో నందు తీరు ప్రేక్షకులకు అర్ధం అయ్యింది. సామ్రాట్ ని నువ్వు నా టమ్మీ అంటూ మాట్లాడిన నందు గీతాకు నువ్వు నాదానివని పదేపదే చెప్పుకున్నాడు. ఇక కౌశల్ ని రూమ్ లోకి వెళ్ళొచ్చా, కూర్చోవచ్చా, తినొచ్చా, తాకొచ్చా అంటూ చాలా వ్యంగ్యంగా సెటైర్ వేశాడు. బయటకి వెళ్ళిపోయాక కూడా బుజ్జీ ఐ లవ్ యూ అంటూ కేకలు పెట్టిన నందును చూసి నందు గీత విషయంలో అభద్రతా భావంలో ఉన్నాడేమో అనే ఫీలింగ్ కలిగింది జనాలకి . మొత్తానికి నందు బిగ్ బాస్ హౌస్ లో కొందరిపై తన కోపం, భార్య గీతపై తన ప్రేమను బిగ్ బాస్ షో వేదికగా వ్యక్తం చేశారు.

Facebook Comments