షాకింగ్ : ఎన్టీఆర్ గురించి రకుల్ అలా అందా ?

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెరంగేట్రం చేసి అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన నటించిన స్టార్ ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ .టాలీవుడ్ లో హీరోయిన్ గా అనతికాలంలోనే స్టార్ ఇమేజ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాష, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ క్రేజ్ వున్న హీరోయిన్ గా మారింది.

తెలుగు సినీ పరిశ్రమ లోని హీరోల గురించి తన అభిప్రాయం చెప్పిన రకుల్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్ చేసింది. ఎన్టీఆర్ గురించి ఏకంగా తెలుగు పరిశ్రమకు ఎన్టీఆర్ ఓ వరం.. మంచి డ్యాన్సర్ అంటూ చెప్పుకొచ్చింది. అందరు హీరోల గురించి మాట్లాడిన అమ్మడు తాతకు తగ్గ మనవడిగా ఇప్పటికే ఇండస్ట్రీ లో క్రేజ్ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి అలా చెప్పటం సినీవర్గాలను, ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. తాతలాగా నవరసాలు పండించగల నటుడు ఎన్టీఆర్ కావటంతోనే రకుల్ అలా కామెంట్ చేసి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమాపై ప్యాషన్ వున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని , అల్లు అర్జున్ ఇండస్ట్రీ ని మరో స్థాయికి తీసుకెళ్లగల హీరో అని,రాం చరణ్ ది చిన్న పిల్లాడి మనస్తత్వం అని చెప్పిన రకుల్ హీరోలకు ఇచ్చిన కాంప్లిమెంట్స్, కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చిన కాంప్లిమెంట్ నందమూరి అభిమానులకు తెగ నచ్చేసింది.

Facebook Comments