ఆ టాపిక్ పై ఎన్టీఆర్ షాకింగ్ స్పందన (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేనికి స్పందించడు అని అందరూ అనుకున్నారో దానికి స్పందించేశాడు. అజ్ఞాతవాసి సినిమా గురించి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమా అజ్ఞాతవాసి గురించి మీడియా సూటిగా అడిగిన ప్రశ్నకు అంతకన్నా సూటిగా సమాధానం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దటీజ్ ఎన్టీఆర్ అనిపించాడు. అయితే అఆచితూచి మాట్లాడే స్వభావం నందమూరి రక్తంలోనే వుంది. అందుకే చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పారు ఎన్టీఆర్ .

హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా అరవింద సమేత. ఈ చిత్రం రిలీజ్ కు ముస్తాబు అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. అయితే ఎంత పాజిటివ్ బజ్ ఉన్నా అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా చెయ్యటం చాలా మందికి నచ్చలేదు. అజ్ఞాత వాసిలా ఫెయిల్ అవుతుందేమో అన్న భావన చాలా మందిలోనే ఉంది అయితే ఇదే విషయాన్ని ఓ మీడియా వ్యక్తి…ఎన్టీఆర్ ను అడిగారు. దానికి ఎన్టీఆర్ చాలా పాజిటివ్ గా స్పందించారు.
” అజ్ఞాతవాసి చిత్రం ప్రభావం నా సినిమాపై పడుతుందని నేను భావించటం లేదు. ప్రతీ సినిమా ఓ కొత్త ప్రయాణమే. నా కెరీర్ లోనూ ప్లాఫ్ లు ఉన్నాయి. నేను ఎప్పుడు నాకు వచ్చిన ప్లాఫ్ తర్వాత సినిమాపై ప్రభావం చూపెడుతుందని భావించలేదు. అరవింద సమేత ప్రత్యేకం గా త్రివిక్రమ్ స్టైల్ సినిమా. ,” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై మూడు లక్షలకు పైగా లైక్స్‌ని సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తే..మంచి రెస్పాన్స్ వచ్చింది. అజ్ఞాత వాసి పై వెంటనే చాలా స్పోర్టివ్ గా స్పందించిన ఎన్టీఆర్ సమాధానం ఫ్యాన్స్ కు తెగ నచ్చింది. అరవింద సమేత హిట్ అవుతుందని అటు ఫాన్స్ లోనూ ఇటు సినీ యూనిట్లోనూ ఉత్సాహం కనిపిస్తుంది.

Facebook Comments