ఎన్టీఆర్ కు కేటీఆర్ వెన్నుపోటు.. అంత కక్ష సాధింపా..?

భారీ అంచనాల నడుమ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా విషయంలో కూడా కేటీఆర్ తన కక్ష సాధింపు చూపిస్తున్నారు. దసరా సెలవులు అయినా సరే స్పెషల్ షో లకు పర్మిషన్ ఇవ్వలేదు.ఏపిలో టిడిపి ప్రభుత్వం ఈ సినిమాకు అండగా నిలిచిస్పెషల్ గా రోజు వేసే నాలుగు ఆటలకు అదనంగా మరో రెండు షోలకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు టికెట్ ప్రైజ్ 200 చేసింది. తెలంగాణా మాత్రం ఎన్టీఆర్ సినిమాకు అన్యాయం చేసింది.

ఏపిలో ప్రతి థియేటర్ లో 6 షోలు వేస్తున్నారు. దీంతో దసరా సెలవులు కావటంతో నందమూరి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం 5 గంటలకే ఏపీ లో మొదట ఆట మొదలవుతుంది. తెలంగాణాలో మాత్రం ఈ సినిమాకు అలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. పర్మిషన్ అడిగినా ససేమిరా అన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ వంటి సిటీస్ లో కూడా మిడ్ నైట్ షోస్ కు పర్మిషన్ ఇవ్వలేదు. అంతేకాదు తెలంగాణాలో ఏ ఒక్క థియేటర్ కు అదనపు షో పర్మిషన్ ఇవ్వలేదు.

ఇది కచ్చితంగా అరవింద సమేత మీద తెలంగాణాలో నిన్నటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వం పెంచుకున్నకక్ష అని తెలుస్తుంది. ఎంత చేసినా ఎవరు అడ్డొచ్చినా స్పెషల్ షో లకు పర్మిషన్ ఇవ్వకున్నా అరవింద సమేత వీర రాఘవ చరిత్ర సృష్టించే తీరుతుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. నానా బాహుబలి రికార్డ్స్ ను తిరగ రాస్తుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. పార్టీల మీద కక్ష వుంటే సినిమాల మీద తీర్చుకోవటం కరెక్ట్ కాదంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

Facebook Comments