ఎన్టీఆర్ ను అందుకు బాలయ్య ఒప్పిస్తాడా.. టీడీపీలో ఇదే చర్చ

హరికృష్ణ మరణం నందమూరి అభిమానులు, నందమూరి కుటుంబం జీర్ణించుకోలేకున్నా ఆయన మరణం కొంత గ్యాప్ వుందని అందరూ భావించిన నందమూరి కుటుంబాన్ని ఒక్కటి చేసింది. హరి కృష్ణ మరణం తరువాత బాలకృష్ణ ఎన్టీఆర్ కలిసి పోయారని చెప్పాలి. అయితే హరికృష్ణ మీద చాలా అభిమానం చూపించే టీడీపీ శ్రేణులు నందమూరి హరిక్రష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆ లోటు ఎన్టీఆర్ తో భర్తీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఒకపక్క చంద్రబాబు నాయుడికి సైతం ఎన్టీఆర్ కు పార్టీలో క్రియాశీలక పాత్ర ఇవ్వాలనే యోచనలో వున్నారు. ఇదే జరిగితే బాగుంటుందని పార్టీ లో చర్చ జోరుగా సాగుతుంది.

ఎన్టీఆర్ ను పొలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటే మంచిదన్న అభిప్రాయంలో కొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యున్నత నిర్ణయం పొలిట్ బ్యూరోకు ఉంటుంది కాబట్టి కీలక పాత్ర పార్టీ లో ఎన్టీఆర్ కు ఉంటేబాగుంటుందనే అభిప్రాయం వుంది. నేతలందరూ నందమూరి కుటుంబంలోని వారైతే బాగుంటుందన్న సలహా చంద్రబాబు కు కూడా ఇచ్చారు.

2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ విస్తృత ప్రచారం వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ గత 8 యేళ్ళుగా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రాజకీయం వైపు వెళ్ళలేదు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ను ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబు బాలకృష్ణ పై పెట్టారని తెలుస్తుంది. మరి బాలకృష్ణ ఎన్టీఆర్ ను ఒప్పించటంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Facebook Comments