ఆపరేషన్‌ గరుడ షురూ…..! బాబుకు నోటీసుల వెనుక అంతర్యం ఇదేనా..?

ఆపరేషన్‌ గరుడ…. ఏపీ రాజకీయాలలో గత ఏడెనిమిది నెలలుగా వినిపిస్తోన్న మాట.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు అమలు చేయనున్న మహా కుట్రగా భావిస్తోన్న ఆపరేషన్‌ గరుడలో ఫస్ట్‌ పార్ట్‌ షురూ అయిందనే లెక్కలు వినిపిస్తున్నాయి.. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం మహారాష్ట్రలో ఫైల్‌ అయిన బాబ్లీ కేసుపై తాజాగా చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ విడుదల కావడం సంచలనం రేపుతోంది.

ఇదంతా మోదీ అండ్‌ టీమ్‌ కుట్ర అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించి చిన్న నోటీసు లేకుండా ఏకంగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం అంటే అసాధారణ విషయం అని, దీనివెనుక రాజకీయ కోణం ఉందని, ఆపరేషన్‌ గరుడను సీక్రెట్‌గా అమలు చేస్తుండడమే కారణమని వివరిస్తున్నారు తమ్ముళ్లు. ఎనిమిదేళ్ల క్రితం గోదావరి నదిపై మహారాష్ట్ర సర్కార్‌ నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులపై నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ టీమ్‌… నిరసన వ్యక్తం చేసింది. ఆ ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఆయన మహారాష్ట్రలో అడుగుపెట్టారు. ఈ విషయం ముందే తెలుసుకున్న మహా సర్కార్‌ నాడు అక్కడ 144 సెక్షన్‌ విధించింది. బాబు టీమ్‌ అక్కడ అడుగుపెట్టడంతో వారిని అరెస్ట్‌ చేసి ఓ స్కూల్‌లో నిర్బంధించారు. ఆ తరవాత వారిని విడుదల చేసి హైదరాబాద్‌కి పంపారు.

నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌…. ఈ కేసులు ఉపసంహరిస్తామని వివరించారు.. తాజాగా బీజేపీ నేతృత్వంలోని మహా సర్కార్‌ నెలకొంది. ఇన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న కేసుపై ఒక్కసారిగా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడం వెనుక ఏదో జరుగుతోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఆపరేషన్‌ గరుడలో   పార్ట్‌ అని త్వరలోనే చంద్రబాబును అరెస్ట్‌ చేసే కూడా ఉండొచ్చని వారు ఆరోపిస్తున్నారు.. మరి, ఈ పరిణామాలు త్వరలోనే ఎలాంటి టర్న్‌లు తీసుకుంటాయో చూడాలి..

Facebook Comments