అమరావతి ప్రజలకు అండగా పవన్… ఏం చేశాడో తెలుసా..

రాజధానిపై రగడ  ఉద్రుతం అవుతుంది. తాజాగా ఏపీలో అధికార పార్టీ పై అన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.ఏపీ రాజకీయాలలో ఇప్పడు అమరావతి రాజధాని ఇష్యూ తీవ్ర ఆందోళనలకి దారి తీస్తుంది.గత 25 రోజులుగా రాజధాని ప్రాంతంలో రైతులు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.వీరికి విపక్షాలు అన్ని మద్దతుగా నిలబడుతూ ఆందోళనగా భాగం అవుతున్నాయి.ఇక తెలుగుదేశం పార్టీ ఈ ఆందోళనలు, అమరావతి రాజధాని ఉద్యమాన్ని అవకాశంగా వాడుకొని ముందుండి నడిపిస్తున్నారు.అయితే అతను ఎంత చేసిన ఆందోళనని అధికార పార్టీ తేలిగ్గా తీసేసి అదంతా టీడీపీ డ్రామా అని, అక్కడ ఉన్న అందరూ పెయిడ్ ఆర్టిస్ట్ లు అంటూ కొట్టి పారేస్తున్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి రాజధాని విషయంలో రైతులకి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు రాజధాని ప్రాంతంలో పర్యటించి ఆ ఆందోళనకి బలం అందించారు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఆందోళనని మరింత తీవ్రతరం చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి రంగంలోకి దిగుతున్నాడని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.ఈ విషయాన్ని ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా చూచాయగా స్పష్టం చేశారు.భవననిర్మాణ కార్మికుల కోసం విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇప్పుడు ఆ తరహాలోనే మరో లాంగ్ మార్చ్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.విజయవాడ నుంచి అమరావతి వరకు ఈ సారి సుదీర్ఘ లాంగ్ మార్చ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.మరి అదే జరిగితే ఈ సారి జనసేన అమరావతి గుంటూరు ప్రాంతాల రైతులకి పెద్ద సపోర్ట్ గా మారి అధికార పార్టీని ఇరుకున పెట్టె అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.