పవన్ సంచలనం.. జనసేనను ఆ పార్టీలో విలీనం

అన్నలానే పార్టీ పెట్టాడు. అన్నలానే దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. చివరకు అన్నలానే పార్టీని వేరే పార్టీలో విలీనం చేస్తాడు అంటున్నారు పవన్ కళ్యాణ్ తీరు చూస్తున్న రాజకీయ వర్గాలు. గతంలో చిరంజీవి కూడా తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్టు పవన్ కూడా తన పార్టీని బీజేపీలో విల్లెనం చెయ్యటానికి చూస్తున్నాడు అని టాక్ వినిపిస్తుంది.

గతంలో పవన్ కళ్యాణ్అన్న చిరంజీవి చేసిన పనికి ఆయన అభిమానులు, తన సామజిక వర్గం ఇప్పటికి కోలుకోలేదు. ఇప్పడు అదే తప్పుని పవన్ చేస్తున్నాడు అంటూ రాజకీయవర్గాల నుంచి విస్వసనీయ సమాచారం.పోలవరం ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్క టీడీపీ నే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన టార్గెట్ టీడీపీనే .. గతంలో టీడీపీ కి సపోర్ట్ వుండి ఒక్కసారిగా ప్రశ్నిస్తా అంటూ రివర్స్ అయ్యాడు పవన్ కళ్యాన్. చంద్రబాబు టార్గెట్ గా తన వాగ్బాణాలను సంధిస్తున్నాడు.

2019 ఎలక్షన్స్ లో బీజేపీ, జనసేన, వైస్సార్సీపీ ఈ మూడు పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీచేస్తాయని అనుకుంటున్నారు. కానీ జగన్ ఈ విషయంపై ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తుంది. దీంతో బీజేపీ మాత్రం ఏపీలో ఉన్న వ్యతిరేఖత నేపధ్యంలో కాస్త ప్రభంజనంలా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించి తమ పార్టీలో విలీనం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఏపీలో పరువు పోగొట్టుకున్న బీజేపీ ఏదో ఒక రకంగా గట్టెక్కాలని చూస్తుంది. అందులో భాగంగానే పవన్ ను టార్గెట్ చేసుకుంది. పవన్ కూడా కేంద్రం ఆడమన్నట్టు ఆడుతున్నాడు. అందులో భాగంగానే బాబుని టార్గెట్ చేసుకున్నాడు. ఇప్పడు కేంద్రం నువ్వే సీఎం అంటే పార్టీ ని విలీనం చేసేస్తాడు అని టాక్. దీంతో అన్న బాటే తమ్ముడు కూడా పట్టబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో తెలియాలంటే మాత్రం మరికొంత కాలం ఆగాల్సిందే.

Facebook Comments