ముద్రగడ ఆ షాకింగ్ డెసిషన్ తో పవన్ కు భారీ షాక్

ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఎన్నిక‌ల సమయం ఆసన్నమవుతుంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహ రచన చేస్తున్నాయి.. ఏ పార్టీ గెల‌వాలన్నా అన్ని సామాజిక వ‌ర్గాలు ముఖ్యం. అందరూ ఓట్లు వేస్తేనే ఎవరైనా అధికారం దక్కించుకునేది. దీంతో కుల రాజకీయ సమీకరణాలు చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి.దీంతో అన్ని సామాజిక వ‌ర్గాల‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న పార్టీలు కులాల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కులాల వారీగా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ కుల సంఘాలను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త హామీలు ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే అధికార తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికే సామాజిక వ‌ర్గాల ఆధారంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడింది. ఇప్ప‌టికే గుంటూరులో నారా హ‌మారా-టీడీపీ హ‌మారా పేరుతో ముస్లిం సామాజిక వ‌ర్గంతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. మైనార్టీలకు ఎన్నో హామీలు ఇచ్చింది.

గ‌త నాలుగేళ్ల ప్ర‌భుత్వంలో ముస్లిం సామాజిక వ‌ర్గ అభివృద్ధి కోసం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను తెలియ‌జేయ‌డంతో పాటు మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే ముస్లింల కోసం చేప‌ట్టే అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించింది. ఇక ఈ నెల‌లో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌య‌హో బీసీ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్క టీడీపీ నే కాదు మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైఎస్ జ‌గ‌న్ కూడా సామాజిక వ‌ర్గాల వారీగా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వారికి హామీలు ఇస్తున్నారు. జగన్ పాద‌యాత్ర‌లో భాగంగా అన్ని సామాజిక వ‌ర్గాల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారు. ప‌వ‌న్ కూడా త‌న ప్ర‌జా పోరాట యాత్ర‌లో భాగంగా వివిధ సామాజిక వ‌ర్గాల వారితో ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతున్నారు. ఇలా కుల రాజకీయాలను చేస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే ఏపీలో కాపు ఓటు బ్యాంక్ అత్యంత కీల‌కం. ఈ నేపధ్యంలో కాపులు ఏ పార్టీ కి మద్దతు ఇస్తారు అనే దాని పైన ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనేది ఆధారపడి ఉంటుంది. ఈ క్ర‌మంలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆదోనిలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆదోనిలో కాపు సంఘం ఏర్పాటు చేసిన కార్తీక వనభోజనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయ‌న‌, ఈ సందర్భంగా కాపులనుద్దేశించి మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ ఏ పార్టీ తో సాధ్యం అయితే ఆ పార్టీ కి కాపుల సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కాపు జాతికి బీసీ రిజర్వేషన్‌ కల్పించే పార్టీని గుర్తించు కుంటామని, 10 లక్షల మందితో వారిని సన్మానిస్తామని ప్ర‌క‌టించారు ముద్ర‌గ‌డ‌. కాపుల‌కు న్యాయం చేసేవారికి మాత్ర‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ మీ కాపు జాతి నాయకుడే కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో ఆలోచిస్తున్నాని, అంద‌రితో చ‌ర్చించిన అనంత‌రంం నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. మొత్తానికి ముద్రగడ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ పార్టీ కి మద్దతు ఇవ్వాలనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఆయన మాటలలోనే తెలుస్తుంది.

Facebook Comments