పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్ …అదిరిపోయే పంచింగ్ డైలాగ్ లు ఇవే…?

కేక పుట్టించే డైలాగ్స్ రాయటం ఆయనకే సాధ్యం..ఆయన అందుకే మాటల మాంత్రికుడయ్యాడు. ఆ మాటల మాంత్రికుడికి దమ్మున్న హీరో జతైతే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్కే అరవింద సమేత వీర రాఘవ ఇప్పుడు అందిస్తుంది. దసరాకు కానుకగా నందమూరి అందించిన ఈ చిత్రం దుమ్ము దులుపుతుంది. పంచ డైలాగ్ లతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తున్న ఈ సినిమా డైలాగ్ల పై బయట చర్చ జరుగుతుంది.

ఎన్.టి.ఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన అరవింద సమేత సినిమా దర్శకుడికి మంచి పేరు తెచ్చి పెడుతుంది. త్రివిక్రమ్తో కెరియర్ లో మొదటిసారి సినిమా చేసిన ఎన్.టి.ఆర్ సినిమాపై ముందునుండి నమ్మకంగా ఉన్నాడు. అరవింద సమేత కూడా దుమ్ముదులిపేయడం ఖాయం అనేస్తున్నారు ఫ్యాన్స్.అయితే ఈ సినిమా టీజర్ ఓకే అనేలా ఉన్నా ట్రైలర్ మాత్రం నందమూరి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. ఎన్.టి.ఆర్ మార్క్ మాస్ ఫార్ములాతో పాటుగా త్రివిక్రమ్ మార్క్ పెన్ పవర్ చూపించాడు. ఇక ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయని తెలుస్తుంది. ఇక అక్కడ సినిమా చూసిన అభిమానులు ఈ సినిమాలో డైలాగ్స్ కేక అనేస్తున్నారు. అంతే కాదు ఆ పవర్ ఫుల్ డైలాగ్ లను తెగ చెప్పేస్తున్నారు.

ఆ పంచింగ్ డైలాగ్ లు ఒకసారి చూద్దాం

జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.. ఎక్కడా ఆగిపోకూడదు

వినే టైము.. చెప్పే మనిషి వల్ల.. విషయం విలువే మారిపోతుంది..

ఆన్సర్ లేని క్వశ్చన్ ఉండొచ్చేమో కాని నీ మీద ప్రేమ లేకుండా ఉండలేను..

నన్ను నమ్మిన వాళ్లకి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తోడు ఉంటూనే ఉంటాను..

విలన్ తో ఎన్.టి.ఆర్ చెప్పే డైలాగ్.. నీ పేరు విలువ నీకేం తెలుసురా.. మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది..

మీరు ఏం చేస్తుంటారు.. మొన్నటిదాకా మొక్కలను కాపాడాను.. ఇప్పుడు ఇంకోటేదైనా ప్లాన్ చేయాలి..

ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి.. అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి..

గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది..

సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు..

ఆలోచించే వాడికంటే ఆలోచింపచేసే వాడే గొప్పోడు

మీ తాత కత్తి పట్టినాడు అంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడు అంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం.. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమవుతుందా..

ఇలా పవర్ అంటే ఇది అని పెన్ పవర్ త్రివిక్రమ్ చూపిస్తే డైలాగ్ డెలివరీ అంటే ఇది అని ఎన్టీఆర్ ఆ డైలాగ్ లతో అదరగొట్టేశాడు.

Facebook Comments