తెలంగాణాలో పీకే సర్వే షాకింగ్ రిజల్ట్…

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైకాపాకు రాజకీయ సలహాలు, సర్వేలు చేసి టీడీపీ గెలుస్తుందని సర్వే లో తేలటంతో పార్టీ ని వీడిన పీకే తెలంగాణలో చేసిన సర్వే కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ప్రశాంత్‌ కిశోర్‌ తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలపై, అసెంబ్లీ రద్దుకు ముందుసర్వే చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. రద్దు తర్వాత కూడా ఫ్లాష్ సర్వే చేసినట్టు వార్తలు జోరందుకున్నాయి.

అయితే పీకే సర్వే లో టీఆర్ఎస్ కు అనుకున్న అన్నీ స్థానాలు రావని తేలిందట.. ఆయన సర్వేలో అధికార టిఆర్‌ఎస్‌కు 56సీట్లు వస్తాయని తేలిందట. అసెంబ్లీ రద్దు చేసిన తరువాత అదీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత చేసిన ఈ ప్లాష్‌ సర్వే అధికార పార్టీకి సాధారణ మెజార్టీ కంటే తక్కువలోనే ఉందని తెలియటంతో టీడీపీ, కాంగ్రెస్ సంబరపడుతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉందని ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దాదాపు 47 శాతం మంది కోరుకుంటున్నారట. అయితే అసెంబ్లీ రద్దుకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవట. అసెంబ్లీ రద్దు తరువాత టిఆర్‌ఎస్‌పై గణనీయమైన వ్యతిరేకత వచ్చిందని సర్వే తేల్చింది. మొత్తం 67 నియోజకవర్గాల్లో పికె టీమ్‌ మూడు రోజులు సర్వే చేస్తే ప్రతి చోటా ఆ పార్టీకి 40శాతం మాత్రమే మద్దతు లభించిందట.

ఆగస్టు 15న కెసిఆర్‌ చేయించిన సర్వేలో ఆ పార్టీ దాదాపు 69స్థానాల్లో గెలుస్తుందని తేలగా ఇప్పుడు 56సీట్లకు వచ్చిందని రానున్న రోజుల్లో మరింతంగా టిఆర్‌ఎస్‌ క్షీణించబోతోందని సర్వే ఫలితాలను బట్టి తేలుతోంది.దీంతో టీడీపీ, కాంగ్రెస్ లు గెలిచే ఛాన్స్ ఎక్కువ వున్నట్టు తెలుస్తుంది. అధికారం వైపు కూటమి అడుగులు పడుతుంటే టీఆర్ఎస్ బలహీనం అవుతుందని సర్వేనే తేల్చింది.

Facebook Comments