రాధాకృష్ణ యూటర్న్ తీసుకుంది అందుకేనా ?

ఆర్కే కొత్త పలుకులో రాసిన వ్యాసం రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ కి కాంగ్రెస్ తో పొత్తు లాభించే అంశం కాదని ,అధికార టిఆర్‌ఎస్‌ 80కి పైగా స్థానాలు దక్కించుకుంటుందని రాసిన వ్యాసం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తెలుగుదినపత్రిక ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రముఖ జర్నలిస్టు అయిన రాధాకృష్ణరెండు వారాల ముందురాసిన వ్యాసానికి ఇప్పుడు రాసిన వ్యాసానికి పొంతనే లేకపోవటం తో రాధాకృష్ణ ఎందుకు ఇలా యూ టర్న్ తీసుకున్నారు అన్నది చర్చకు దారి తీసింది.

తాజాగా రాధాకృష్ణ వ్యాసంపై పలు రకాలైన విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఆయన ఏ ప్రాతిపదికన టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని రాశారు? ఆయన రాతలకు విశ్వసనీయత ఉందా ? అన్న దానిపై సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ నడిచింది. కేవలం రెండు వారాల ముందు ముందస్తు ఎన్నికలు జరిగితే టిఆర్‌ఎస్‌ గెలుపు కష్టమేనని రాసిన రాధాకృష్ణ తిరిగి టిఆర్‌ఎస్‌ ఏకపక్షంగా గెలుస్తుందని, అదీ ఊహించని మెజార్టీతో గెలుస్తుందని ప్రకటించటానికి కారణాలు తెలిస్తే అవాక్కవుతారు .
ఒక వైపు క్షేత్రస్థాయిలో టిఆర్‌ఎస్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టీఆర్ఎస్ కి ప్రతికూల వాతావరణం వుందని చెప్పిన రాధాకృష్ణ రెండు వారాల్లోనే అంతా టీఆర్ఎస్ కు పాజిటివ్ గా ఉన్నట్టు రాశారు. చంద్రబాబు పునరాలోచించుకోవాలని, పొత్తుల విషయంలో కాంగ్రెస్ తో పొత్తు మంచిది కాదని హితబోధ చేశారు. ఈ యూటర్న్ వెనుక అసలు విషయం ఏంటంటే గవర్నమెంట్ రద్దు అయ్యే కొన్ని రోజుల ముందే కొన్ని వందల కోట్ల రూపాయిల ప్రాజెక్ట్ ఆర్కే సమీప బంధువు కి ఇచ్చారట, దాని కోసం ఆర్కే ఈ సడెన్ యు టర్న్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ తమ అస్మదీయులకు ఇవ్వటంతో చాలా మార్పులు వచ్చాయని తెలుస్తుంది.

ఆగస్టు26న ఆయన రాసిన కొత్తపలుకు వ్యాసంలో కాంగ్రెస్‌,టిడిపి పొత్తు పెట్టుకుంటే టిఆర్‌ఎస్‌ గెలుపు కష్టమేనన్నారు. టిడిపి ఇంకా క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఆ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు టిడిపి వైపే ఉన్నారని వారితో కాంగ్రెస్‌ గెలిస్తే టిఆర్‌ఎస్‌ గట్టెక్కడం కష్టమని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసినా టిఆర్‌ఎస్‌దే విజయమని చెప్పడం, పొత్తు తో లాభంలేదని స్టేట్ మెంట్ ఇవ్వటంపై మండిపడుతున్నారు. రాధాకృష్ణ స్వయం ప్రయోజనాల కోసం టిడిపితో ఆడుకుంటున్నారని చనువిస్తే చంకకెక్కుతున్నాడని మండిపడుతున్నవాళ్ళు చంద్రబాబుకే సలహాలిస్తున్న రాధాకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Facebook Comments