నారాగా రానా ఫస్ట్ లుక్… అచ్చు గుద్దినట్టు చంద్రబాబులానే

బయో పిక్ తియ్యాలంటే చాలా సమర్ధత కావాలి. ముఖ్యం గా నటీనటుల ఎంపిక పాత్రలకు తగ్గట్టు వుండాలి. సావిత్రి బయోపిక్ అంతగా సక్సెస్ కావటంలో సావిత్రిగా కీర్తి సురేష్ ను ఎంచుకోవటమే ప్రధాన కారణం. సావిత్రి గారితో చాలా వరకు దగ్గర పోలికలున్న కీర్తి సురేష్ ఆ పాత్రకు జీవం పోసింది. తెలుగునాట మహానటిగా సంచలనం సృష్టించింది.


తాజాగా బాలకృష్ణ అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బయోపిక్ ఎన్టీఆర్. క్రిష్ డైరెక్టర్ గా బాలకృష్ణ ఎన్టీఆర్ గా, రానా చంద్రబాబు నాయుడిగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరులతో కలిసి బాలక్రిష్ణ నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అతి ముఖ్యమైన నారా చంద్రబాబు నాయుడుగారి పాత్ర కోసం రానాను ఎంచుకున్నారు. యుక్త వయసులో చంద్రబాబు ఎలా ఉండేవారో అచ్చు అలానే ఉండేలా రానాకు మేకోవర్ చేయించారు క్రిష్. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ లుక్ చూస్తుంటే 80 ల దశకంలోని చంద్రబాబుని చూసినట్టే ఉందని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు రానా. ప్రేక్షకుల నుండి దీనికి మంచి ప్రశంసలు అందుతున్నాయి.రానా… అచ్చు గుద్దినట్టు నారా లానే ఉన్నారనే పొగడ్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తున్న క్రిష్ పై అంచనాలు పెరుగుతున్నాయి.ఎన్టీఆర్ బయోపిక్ తో రానా నారా చంద్రబాబు నాయుడిగా ఆ పాత్రకు జీవం పోస్తాడనే అంచనాలో ఉన్నారు నారా అభిమానులు .

Facebook Comments