జగన్ కు టైం దగ్గరలోనే వుంది..సీనియర్ నేత ఆగ్రహం…

వైఎస్ జగన్  రాష్ట్రాన్ని తనకు ఇష్టం వచ్చినట్టు పరిపాలన  చేస్తున్నాడని సిపిఐ నెత  నారాయణ మండిపడ్డారు.కాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరైన సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ… సీఎం జగన్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఒక నియంతలా పాలిస్తున్నారని, అధికార గర్వంతో కొట్టుకుంటున్నారు తప్ప, ప్రజల కోసం ఏనాడూ ఆలోచించడం లేదని అన్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా సీఎం జగన్ తన పంతా మార్చుకోవాలని లేకపోతె భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఐ నారాయణ హెచ్చరించారు.

 

ఇకపోతే అధికార పార్టీ కి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గర్వంతో సీఎం జగన్ కూడా ప్రస్తుతానికి నియంతలా మారిపోయారని, రాష్ట్ర రాజధాని కోసం దాదాపుగా 39 మంది చనిపోయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం అసలే స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని సి నేత నారాయణ ఆరోపించారు. ఇకపోతే రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని అనడం చాలా బాధాకరం అని వాఖ్యానించారు. ఇకపోతే విశాఖలో వైసీపీ నేతలు భూ మాఫియా చేస్తున్న కారణంగా రాజధానికి మొగ్గు చూపుతున్నారని సిపిఐ నేత నారాయణ, వైసీపీ నేతలందరిపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.